రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్‌తో.. ఇన్ని లాభాలా..?

మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అని చెబుతుంటారు. అందుక‌ని మ‌ద్యం తాగొద్ద‌ని సూచిస్తుంటారు. అయితే నిజానికి రోజుకు ఒక గ్లాస్ వైన్ తాగితే మంచిదేన‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ఈవిష‌యాన్ని ఇప్ప‌టికే అనేక మంది నిపుణులు చెప్పారు. ఈ క్ర‌మంలోనే రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

drink daily one glass of red wine for these benefits

1. రెడ్ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న‌ల్ని అవి ఆరోగ్యంగా ఉంచుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. క్యాన్స‌ర్‌ల‌ను క‌ల‌గ‌జేసే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను యాంటీ ఆక్సిడెంట్లు నాశ‌నం చేస్తాయి. దీంతో క్యాన్స‌ర్ రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

2. కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్న‌వారు రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగ‌వ‌చ్చు. దీంతో కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది.

3. రెడ్‌వైన్‌లో పాలిఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ర‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకుల‌ను తొల‌గిస్తాయి. ర‌క్త నాళాలు సుల‌భంగా వంగేలా చేస్తాయి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ఫ‌లితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జ‌బ్బులు.. హార్ట్ ఎటాక్ లు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

4. డ‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ రెడ్ వైన్ తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ తగ్గుతాయి. రెడ్ వైన్‌లో ఉండే రెస్వెరెట్రాల్ అనే స‌మ్మేళ‌నం షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తుంది.

5. సీజ‌న్లు మారిన‌ప్పుడ‌ల్లా స‌హ‌జంగానే ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే రోజూ రెడ్ వైన్ తాగితే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క‌ణాల‌ను ర‌క్షిస్తాయి. దీంతోపాటు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి. ఈ క్ర‌మంలో ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. క‌నుక రెడ్ వైన్ తాగ‌డం మంచిది.

6. సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల ప్ర‌కారం.. రెడ్ వైన్‌లో ఉండే రెస్వెరెట్రాల్ అనే స‌మ్మేళ‌నం మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. మెద‌డు యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. దీంతో ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి. అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు ఉన్న‌వారు ఆ వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

7. రెడ్‌వైన్‌లో పిసియాటానోల్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది శ‌రీర బ‌రువును త‌గ్గిస్తుంది. క‌నుక రెడ్ వైన్‌ను తాగుతుంటే బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

8. డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న‌వారు రోజూ రెడ్ వైన్ తాగితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న కూడా త‌గ్గుతాయి.

అయితే రెడ్ వైన్ ఆరోగ్య‌క‌ర‌మే అయిన‌ప్ప‌టికీ రోజుకు ఒక గ్లాస్ మించ‌రాదు. అధికంగా సేవిస్తే ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌క‌పోగా.. సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి. క‌నుక మోతాదులో తీసుకుంటే లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts