రాత్రి పూట పాలలో అల్లం రసం కలిపి తాగండి.. ఈ సీజన్‌లో తప్పక తాగాల్సిందే..

మన శరీరానికి పాలు ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. పాలలో మన శరీరానికి కావల్సిన పోషకాలు దాదాపుగా అన్నీ లభిస్తాయి. కనుకనే పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. అనేక మంది నిపుణులు సైతం రోజూ ఒక గ్లాస్‌ పాలను తాగాలని సూచిస్తుంటారు. అయితే పాలలో అల్లం రసం కలిపి తాగడం వల్ల ఇంకా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. శరీరానికి పోషకాలను అందించడంతోపాటు వ్యాధులు కూడా తగ్గుతాయి. ఇక రాత్రి ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో కాస్త అల్లం రసం కలిపి తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సీజన్‌లో మన శరీర రోగ నిరోధక శక్తి సహజంగానే తగ్గుతుంది. ఎందుకంటే అనేక రకాల బాక్టీరియా, వైరస్‌లు మనపై దాడి చేస్తాయి. దీంతో వాటిపై పోరాడేందుకు రోగ నిరోధక వ్యవస్థ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. కనుక రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అయితే అల్లం రసం కలిపిన పాలను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీంతో సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందుగానే అరికట్టవచ్చు. దగ్గు, జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలను నివారించవచ్చు. ఒక వేళ ఇవి వచ్చినా ఈ మిశ్రమాన్ని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. కనుక రోజూ రాత్రి అల్లం రసం కలిపిన పాలను తాగడం మంచిది.

drink ginger juice with milk daily at night for these benefits

ఈ సీజన్‌లో మనకు సహజంగానే ఫుడ్‌ పాయిజనింగ్‌ అవుతుంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. డయేరియా, మలబద్దకం, గ్యాస్‌ వంటి సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. కానీ అల్లం రసం కలిపిన పాలను తాగడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫుడ్‌ పాయిజనింగ్‌ కాకుండా చూసుకోవచ్చు. విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ సీజన్‌లో అల్లం రసం కలిపిన పాలను తప్పక తాగాలి.

అల్లం రసం కలిపిన పాలను తాగడం వల్ల తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు చేరి క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. కనుక పాలలో అల్లం రసం కలిపి సేవించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. మరీ ఈ సీజన్‌లో అయితే ఈ మిశ్రమాన్ని రోజూ రాత్రి తప్పక తాగాల్సి ఉంటుంది.

Editor

Recent Posts