రోజూ గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. గ్రీన్ టీ తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. గ్రీన్ టీలో కొందరు చక్కెర కలిపి తాగుతారు. కానీ ఆ టీని అలా తాగరాదు. చక్కెర, పాలు కలపకుండానే తాగాలి. అలా తాగితేనే గ్రీన్ టీ వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. ఇక గ్రీన్ టీని రోజూ తాగడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గ్రీన్ టీ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కనుక బరువు తగ్గాలనుకునే వారు రోజూ గ్రీన్ టీని తాగాలి. రోజుకు 2 సార్లు అయినా గ్రీన్ టీని తాగితే బరువు తగ్గవచ్చు.
2. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు రోజూ గ్రీన్ టీని తాగాలి.
3. ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో సతమతం అయ్యేవారు రోజూ రెండు సార్లు గ్రీన్ టీ తాగితే ఫలితం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే సమ్మేళనాలు మూడ్‌ను మారుస్తాయి. మనస్సుకు ప్రశాంతతను అందిస్తాయి.
4. గ్రీన్ టీలో కాటెకిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మెదడును చురుగ్గా మారుస్తాయి. యాక్టివ్‌గా ఉంటారు. ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. మెదడు పనితీరు మెరుగు పడుతుంది.
5. గ్రీన్ టీలో ఉండే కాటెకిన్స్‌తోపాటు ఫుల్‌నొల్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365