Buttermilk : చలికాలం నెమ్మదిగా ముగింపు దశకు వచ్చేసింది. వేసవి కాలం సమీపిస్తోంది. ఇది సీజన్ మారే సమయం. కనుక ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక ప్రతి రోజూ మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత కచ్చితంగా ఒక గ్లాస్ మజ్జిగను తాగాలి. దీంతో ఈ సమయంలో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. రోజూ లంచ్ అనంతరం ఒక గ్లాస్ మజ్జిగను తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ఒక గ్లాస్ మజ్జిగను తాగడం వల్ల అనేక వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్, కడుపులో మంట తగ్గుతాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం చల్లగా మారుతుంది. వాతావరణం వేడిగా ఉంటుంది కనుక శరీరానికి చల్లదనం లభిస్తుంది. దీంతో సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
ఇక మజ్జిగను సేవించడం వల్ల శరీరంలో వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది.
ఆకలి అసలు లేని వారు మధ్యాహ్నం గ్లాస్ మజ్జిగలో కొద్దిగా అల్లం రసం, ఉప్పు, కొత్తిమీర కలిపి తాగాలి. దీంతో ఆకలి బాగా పెరుగుతుంది. అజీర్ణం తగ్గుతుంది. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. మజ్జిగను తాగడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
మజ్జిగను ఇలా తయారు చేసుకుని తాగితే మంచిది..
పావు కప్పు పెరుగును ఒక గ్లాస్ లో వేయాలి. అనంతరం అందులో నీటిని పోసి నింపాలి. ఆ నీటిలో ఉప్పు తగినంత వేయాలి. అలాగే అర టీస్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా అల్లం రసం, కొత్తిమీర వేయాలి. అనంతరం బాగా కలపాలి. అవసరం అయితే మిక్సీలో వేసి బ్లెండ్ చేయవచ్చు. దీంతో పెరుగు అన్నింటితో బాగా కలుస్తుంది. ఈ క్రమంలో మజ్జిగ తయారవుతుంది. దాన్ని 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచితే చల్లగా అవుతుంది. అనంతరం దాన్ని తాగవచ్చు. అందులో కరివేపాకులు, పుదీనా, ఉల్లిపాయలను కూడా వేసి తాగవచ్చు. ఇలా మజ్జిగను తయారు చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.