MS Dhoni : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో గుడ్‌బై చెప్పాడు. 2020 ఆగస్టులో ధోనీ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. కానీ ఐపీఎల్‌లో మాత్రం ఆడుతూనే ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఈ టీమ్‌కు ఎన్నో ట్రోఫీలను అందించాడు. ఇక త్వరలో ఐపీఎల్ ప్రారంభం కానుండడంతో మరోమారు చెన్నైకి నాయకత్వం వహించనున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన మెగా వేలం ముందు చెన్నై జట్టు.. ధోనీని రిటెయిన్ చేసుకుంది. దీంతో ఈసారి కూడా ధోనీ చెన్నైకే ఆడనున్నాడు.
ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండడంతో మ్యాచ్ లను ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ధోనీకి చెందిన పలు ప్రమోషనల్ వీడియోలను విడుదల చేసింది. ఒక దాంట్లో అద్దాలు పెట్టుకుని క్లాస్ లుక్‌లో ధోనీ కనిపించగా.. మరోదాంట్లో మాస్ లుక్‌లో కనిపించాడు. ఐపీఎల్ ప్రచారం కోసం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ధోనీతో ఈ యాడ్‌లను షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే వాటి ప్రోమోలను విడుదల చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈసారి ఐపీఎల్‌ను కేవలం నాలుగు వేదికల్లోనే నిర్వహించనున్నారు. ముంబై, పూణెల్లో ఉన్న స్టేడియంలలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. అలాగే ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహిస్తారు. ఈసారి గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జియాంట్స్ జట్ల చేరికతో టీమ్‌ల సంఖ్య 10కి చేరింది. దీంతో 5 చొప్పున జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఎ లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జియాంట్స్ జట్లు ఉండగా.. గ్రూప్ బి లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి.