Dry Apricot : ఈ పండ్ల‌లో ఉండే పోష‌కాలు, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Dry Apricot : మ‌న‌కు డ్రై ఫ్రూట్ రూపంలో ల‌భించే వివిధ ర‌కాల పండ్ల‌ల్లో ఆఫ్రికాట్ కూడా ఒక‌టి. ఆఫ్రికాట్ పుల్ల‌పుల్ల‌గా తియ్య తియ్య‌గా చాలా రుచిగా ఉంటుంది. పండుతో పాటు మ‌న‌కు డ్రై ఫ్రూట్ రూపంలో కూడా ఇది ల‌భిస్తుంది. డ్రై ఆఫ్రికాట్ ను తిన్నా కూడా మ‌న‌కు ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిని నేరుగా తిన‌డంతో పాటు తీపి వంట‌కాల్లో కూడా ఉప‌యోగిస్తారు. ఆఫ్రికాట్ తో చేసే కుబానికా మీటా అనే తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఇత‌ర డ్రై ఫ్రూట్స్ వ‌లె ఆఫ్రికాట్ లో కూడా ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఆఫ్రికాట్ లో ఉండే పోష‌కాల గురించి అలాగే దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిలో క్యాల్షియం. విట‌మిన్ ఎ, పొటాషియం, ఐర‌న్, విట‌మిన్ సి వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి.

ర‌క్త‌హీన‌తతో బాధ‌ప‌డే వారు రోజూ ఒక డ్రై ఆఫ్రికాట్ ను తింటే శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే ఆఫ్రికాట్ లో పీచు ప‌దార్థాలు అధికంగా ఉంటాయి. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నివారించ‌బ‌డుతుంది. ఆఫ్రికాట్ ను తిన‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా, బ‌లంగా త‌యార‌వుతాయి. శ‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను క‌రిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా ఆఫ్రికాట్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఆఫ్రికాట్ ను తిన‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వీటిని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల వివిధ ర‌కాల కంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేరకుండా ఉంటాయి. దీనిలో ఉండే విట‌మిన్ సి శ‌రీరంలో రోగ నిరోధక శ‌క్తి పెరుగుతుంది. క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉంటాము. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో ఎల‌క్ట్రోలైట్ ల స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో కూడా ఆఫ్రికాట్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది.

Dry Apricot in telugu this fruit health benefits
Dry Apricot

అంతేకాకుండా దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. ఆఫ్రికాట్ లో ఉండేయాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరంలో ఫ్రీరాడిక‌ల్స్ ను న‌శింప‌జేయ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఆఫ్రికాట్ ల‌ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. చ‌ర్మంపై ముడ‌త‌లు తొల‌గిపోతాయి. వృద్దాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. అయితే డ్రై ఆఫ్రికాట్ ల‌ను తిన్న త‌రువాత వెంట‌నే నోటిని శుభ్రం చేసుకోవాలి. వీటిలో ఉండే చ‌క్కెరలు దంతాల ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేస్తాయి. రోజుకు ఒక‌టి లేదా రెండు డ్రై ఆఫ్రికాట్ ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వీటిని త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts