ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో శరీరానికి సమతుల ఆహారం లభిస్తుంది. అన్ని విధాలుగా మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే రోజూ మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత చిన్న బెల్లం ముక్కను నెయ్యితో తీసుకోవాలి. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం చిన్న బెల్లం ముక్కను నెయ్యితో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2. బెల్లంలో ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, విటమిన్లు బి, సి ఉంటాయి. అదేవిధంగా నెయ్యిలో విటమిన్లు ఎ, ఇ, డి లు ఉంటాయి. అందువల్ల ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే దాదాపుగా మనకు అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ అందుతాయి.
3. నెయ్యిలో ఉండే విటమిన్ కె ఎముకలు కాల్షియంను శోషించుకునేందుకు సహాయ పడుతుంది. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
4. బెల్లం, నెయ్యిలను కలిపి తినడం వల్ల శరీరంలో హార్మోన్లు సమతుల్యం అవుతాయి. హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి.
5. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.
6. మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో కొద్దిగా బెల్లం పొడి కలిపి మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే తినాలి. దీంతో ప్రయోజనాలు కలుగుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365