భోజనం చేసిన తరువాత కొన్ని రకాల పండ్లను తినకూడదు. ఎందుకంటే అవి తినడం వల్ల మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించలేదు. కనుక కొన్ని రకాల పండ్లను భోజనం చేసిన వెంటనే తినకూడదు. కనీసం 1 గంట సమయం ఇచ్చి తినాలి. అయితే కొన్ని రకాల పండ్లను మాత్రం భోజనం చేసిన వెంటనే తినవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. యాపిల్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కనుక ఈ పండ్లను భోజనం చేసిన వెంటనే తినవచ్చు. భోజనం చేసిన తరువాత ఈ పండ్లను తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్, మలబద్దకం, అసిడిటీ ఉండవు.
2. భోజనం చేసిన తరువాత తినదగిన పండ్లలో అరటి పండు ఒకటి. దీంతో శక్తి లభిస్తుంది. హైబీపీ తగ్గుతుంది. తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. అసిడిడీ రాదు.
3. అజీర్ణ సమస్య కొందరిని ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాంటి వారు భోజనం చేశాక ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలను తినాలి. దీంతో తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ ఏర్పడవు. జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది.
4. జీర్ణ సమస్యలు ఉన్నవారు భోజనం చేశాక పైనాపిల్ పండ్లను తింటే మంచిది. దీంతో ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య ఉండదు.
5. భోజనం చేసిన అనంతరం అంజీర్ పండ్లను కూడా తినవచ్చు. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. వ్యర్థాలను బయటకు పంపుతుంది. అందువల్ల భోజనం చేశాక వీటిని తీసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365