Diabetes : ప్రస్తుతం చాలా మందిని డయాబెటిస్ సమస్య ఇబ్బందులకు గురిచేస్తోంది. టైప్ 1, 2 ఇలా రెండు రకాల డయాబెటిస్‌లు చాలా మందికి వస్తున్నాయి. అయితే ఎక్కువగా టైప్ 2 డయాబెటిస్ బారిన అనేక మంది పడుతున్నారు. ముఖ్యంగా అస్తవ్యస్తమైన జీవనశైలి వల్లే టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. అయితే దీనికి డాక్టర్లు ఇచ్చిన మందులను సకాలంలో వాడాల్సి ఉంటుంది. దీంతోపాటు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. అప్పుడే షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
అయితే షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు పొద్దు తిరుగుడు విత్తనాలు కూడా బాగా పనిచేస్తాయి. వీటిల్లో అనేక అద్భుతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. ఈ విత్తనాల్లో క్లోరోజెనిక్ యాసిడ్, సెకోఐసోలారిసిరెసినోల్ అనే బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇలా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
పొద్దు తిరుగుడు విత్తనాలను రోజూ గుప్పెడు మోతాదులో తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గి షుగర్ లెవల్స్ మెరుగు పడతాయి. దీంతో డయాబెటిస్ నుంచి విముక్తి లభిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీని వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇలా ఈ విత్తనాలతో డయాబెటిస్ ఉన్నవారు ప్రయోజనాలను పొందవచ్చు.