కోడిగుడ్లను ఉడకబెట్టిన తరువాత ఆలస్యంగా తింటున్నారా ? అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా ?

కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి తిన‌డం అంటే చాలా మందికి ఇష్ట‌మే. కానీ వాటిని ఉడ‌క‌బెట్టిన త‌రువాత ఆల‌స్యంగా తిన‌రాదు. వెంట‌నే తినేయాలి.

<p style&equals;"text-align&colon; justify&semi;">మనకు అందుబాటులో ఉన్న అనేక పౌష్టికాహారాల్లో కోడిగుడ్లు ఒకటి&period; కోడిగుడ్లను ఒకప్పుడు ఏ ఆదివారమో తినేవారు&period; కానీ వాటిని ప్రస్తుతం రోజూ తింటున్నారు&period; ఇక వ్యాయామం చేసేవారు అయితే రోజూ గుడ్లను తినాల్సిందే&period; అలాగే చిన్నారులకు తల్లిదండ్రులు రోజూ గుడ్లను తినిపిస్తుంటారు&period; కోడిగుడ్లను కొందరు ఆమ్లెట్‌ వేసుకుని తింటే కొందరు ఫ్రై లేదా కూరలా చేసి తింటారు&period; కొందరు ఉడకబెట్టుకుని తింటారు&period; అయితే అన్నింటిలోకెల్లా ఉడకబెట్టి తినడమే శ్రేయస్కరమని నిపుణులు చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6156 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;boiled-eggs&period;jpg" alt&equals;"కోడిగుడ్లను ఉడకబెట్టిన తరువాత ఆలస్యంగా తింటున్నారా &quest; అయితే జాగ్రత్త&period;&period; ఎందుకో తెలుసా &quest;" width&equals;"1200" height&equals;"793" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడకబెట్టిన గుడ్లను వెంటనే తినాల్సి ఉంటుంది&period; ఆలస్యం చేస్తే గుడ్లు గాలికి ప్రభావితం అవుతాయి&period; గాలిలో ఉండే బాక్టీరియా&comma; ఇతర సూక్ష్మ క్రిములు గుడ్లపై వ్యాప్తి చెందుతాయి&period; దీంతో ఎక్కువ సమయం పాటు ఉంచిన గుడ్లను తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి&period; అందువల్ల కోడిగుడ్లను ఉడకబెడితే వెంటనే తినాల్సి ఉంటుంది&period; ఆలస్యం చేయరాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కోడిగుడ్లను ఉడకబెట్టిన తరువాత వాటి మీద ఉండే పొట్టును తీయరాదు&period; పొట్టును తీస్తే గుడ్డుపై బాక్టీరియా ప్రభావం పడుతుంది&period; కనుక పొట్టును తీయకుండా ఉంటే గుడ్లను ఎక్కువ సేపు ఉంచి కూడా తినవచ్చు&period; ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు&period; కానీ గుడ్డును ఉడకబెట్టిన తరువాత పగిలితే మాత్రం వెంటనే పొట్టును తీసేసి తినాలి&period; అలాగే ఉంచరాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కోడిగుడ్లను ఉడకబెట్టిన తరువాత పొట్టు తీసి చాలా సేపటికి తింటాం&period;&period; అంటే వాటిని ఒక పాత్రలో ఉంచి మూత పెట్టి దాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి&period; ఇలా చేస్తే గుడ్లు తాజాగా ఉంటాయి&period; గుడ్లను 4 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎంత సేపైనా నిల్వ చేయవచ్చు&period; అలా నిల్వ ఉంచిన గుడ్లు వారం వరకు బాగానే ఉంటాయి&period; అప్పటి వరకు వాటిని తినవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా ఉడకబెట్టిన గుడ్లను తింటే ప్రయోజనాలు పొందవచ్చు&period; ఆరోగ్యంగా ఉంటాము&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts