మెంతులతో ఉపయోగకరమైన ఇంటి చిట్కాలు.. ఏయే అనారోగ్య సమస్యలకు పనిచేస్తాయంటే..?

మెంతులను నిత్యం మనం పలు రకాల వంటల్లో వేస్తుంటాం. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేక వ్యాధులను మనం మెంతులతో తగ్గించుకోవచ్చు. మెంతులతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతులతో ఉపయోగకరమైన ఇంటి చిట్కాలు.. ఏయే అనారోగ్య సమస్యలకు పనిచేస్తాయంటే..?

1. ఒక గ్లాస్‌ నీటిలో రెండు టీస్పూన్ల మెంతులను వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని సన్నని మంటపై 5 నిమిషాల పాటు అలాగే మరిగించాలి. తరువాత వచ్చే నీటిని వడకట్టి అందులో కొద్దిగా తేనె కలిపి తాగాలి. దీంతో బాలింతల్లో పాలు బాగా పడతాయి.

2. రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతులను తినడం వల్ల, ఆ నీటిని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. షుగర్‌ లెవల్స్‌ అదుపులోకి వస్తాయి.

3. గుప్పెడు మెంతులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను ముఖానికి ఫేస్‌ ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో ముఖం కాంతింవంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

4. మెంతులను నీటిలో నానబెట్టి అనంతరం పేస్ట్‌లా చేసి దాన్ని జుట్టుకు బాగా రాయాలి. 10 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేయాలి. దీంతో జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టు బాగా పెరుగుతుంది. చుండ్రు తగ్గుతుంది.

5. మెంతులను నానబెట్టి రోజూ తింటుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Share
Admin

Recent Posts