బయట మనకు ఎక్కడ చూసినా చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ అందుబాటులో ఉంది. ఫ్రైడ్ రైస్, నూడుల్స్, మంచూరియా.. ఇలా రక రకాల చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి రుచికరంగా అనిపిస్తాయి. వాటిని వండేటప్పుడు వచ్చే వాసన కూడా కొందరికి నోట్లో నీళ్లు ఊరించేలా చేస్తుంది. కానీ ఆ ఫాస్ట్ ఫుడ్‌ను తినడం ఎంతో ప్రమాదకరం. ఎందుకో ఇక్కడ తెలుసుకోండి.
చైనీస్ ఫాస్ట్ ఫుడ్‌లో అజినొమోటో కలుపుతారు. దీన్నే మోనో సోడియం గ్లూటమేట్ (ఎంఎస్‌జీ) లేదా టేస్టింగ్ సాల్ట్ అంటారు. దీన్ని వేయడం వల్లే ఫాస్ట్ ఫుడ్‌కు ఆ వాసన, రుచి వస్తాయి. అయితే ఇది ప్రమాదకరమైన కెమికల్. దీన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.
1000 గ్రాముల అజినొమోటో లో సుమారుగా 12,300 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. 21.2 మిల్లీగ్రాముల కాల్షియం, 0.4 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటాయి. అయితే సోడియం ఎక్కువగా ఉంటుంది కనుక అజినొమోటో మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అనారోగ్య సమస్యలను కలగజేస్తుంది.
అజినొమోటో ను తక్కువ మోతాదులో తీసుకుంటే ఏమీ కాదు. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటేనే ప్రమాదకరం. అందువల్ల చీటికీ మాటికీ చైనీస్ ఫాస్ట్ ఫుడ్‌ను తినేవారు వాటిని తినడం తగ్గించుకుంటే మంచిది. లేదంటే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.
అజినొమోటో మన శరీరంలో ఎక్కువగా చేరితే అనారోగ్య సమస్యలను కలగజేస్తుంది. దీంతో చెమట ఎక్కువగా పడుతుంది. శరీరం దుర్వాసన వస్తుంది. అలసట, డీహైడ్రేషన్, కీళ్లు, కండరాల నొప్పులు, జీర్ణాశయంలో మంట, అసిడిటీ, గ్యాస్, బీపీ పెరగడం, తలనొప్పి, నిద్రలేమి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. గురక కూడా వస్తుంది.
అజినొమోటో మోతాదుకు మించితే పలు రకాల క్యాన్సర్లు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని సైంటిస్టులు తమ పరిశోదనల్లో వెల్లడించారు. ఆ వివరాలను ఓ జర్నల్‌లోనూ ప్రచురించారు. అందువల్ల అజినొమోటో కు దూరంగా ఉండాలి. వీలైతే పూర్తిగా మానేయాలి. లేదా తక్కువ మోతాదులో తీసుకోవాలి. చైనీస్ ఫాస్ట్ ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడకూడదు. కావాలంటే ఇంట్లోనే అజినొమోటో లేకుండా ఫాస్ట్ ఫుడ్ వంటకాలను చేసుకుని తినవచ్చు. దీంతో అనారోగ్యాల బారిన పడకుండా చూసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365