Eggs In Fridge : కోడిగుడ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే ముందు ఇది తెలుసుకోండి..

Eggs In Fridge : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్ల‌ను త‌క్కువ ధ‌ర‌లో అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. దీనిలో ఎంత‌టి పౌష్టికాహారం ఉంటుందో మ‌నంద‌రికి తెలిసిందే. త‌ల్లిపాల త‌రువాత అంత‌టి పౌష్టికాహారాన్ని క‌లిగి ఉన్న‌వి కోడిగుడ్లే. వాటిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ల‌భిస్తాయి. అయితే కోడిగుడ్ల‌ను తినే వారు మాత్రం ఖ‌చ్చితంగా ఈ విష‌యాల‌ను తెలుకోవాల్సిందే. కోడిగుడ్డులోని ప‌చ్చ సొన‌ను బ‌ట్టి దాన్ని పెట్టిన కోడి ఎటువంటి ఆహారాన్ని తీసుకుందో సుల‌భంగా చెప్ప‌వ‌చ్చు. గుడ్డు ప‌చ్చ సొన బాగా పుసుపు రంగులో ఉంటే దానిని పెట్టిన కోడి ఆకుప‌చ్చ ఆహారాన్ని తీసుకుంద‌ని అర్థం. అలాకాకుండా ప‌చ్చ‌సొన సాధార‌ణ‌పు ప‌సుపు రంగులో ఉంటే ఆ గుడ్డును పెట్టిన కోడి మొక్క‌జొన్న‌ల‌ను తిన్న‌ద‌ని అర్థం.

మ‌నంద‌రం కోడిగుడ్ల‌ను చాలా రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచుతాం. మ‌నం వాడే ఫ్రిజ్ లో కూడా కోడిగుడ్ల‌ను పెట్ట‌డానికి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. కానీ గుడ్ల‌ను అందులో ఉంచ‌డానికి ముందు ఆలోచించాలి. ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనారోగ్యాల బారిన ప‌డాల్సి వ‌స్తుంద‌ని అధ్య‌య‌నాలు తెలియ‌జేస్తున్నాయి. కోడిగుడ్ల‌ను ఎందుకు ఫ్రిజ్ లో ఉంచ‌కూడ‌దు అనే విష‌యాలు తెలిస్తే ఆశ్చ‌ర్యానికి గురి కావల్సిందే. ముందుగా కోడిగుడ్ల‌ను ఫ్రిజ్ లో ఎందుకు ఉంచుతున్నామో తెలుసుకుందాం. గుడ్ల‌ను ఫ్రిజ్ లో ఉంచ‌డం మంచిదే అని చెప్ప‌వ‌చ్చు. గుడ్ల‌ను ఫ్రిజ్ లో ఉంచ‌డం వ‌ల్ల ఆహారం విషంగా మార‌కుండా ఉంటుంది.

Eggs In Fridge important things to know
Eggs In Fridge

అంతేకాకుండా ఫ్రిజ్ లో లోప‌ల సాల్మ‌నెల్లా అభివృద్ధి చెందదు. ఫ్రిజ్ లోప‌ల నిల్వ చేసిన గుడ్డు తెల్ల‌సొన కంటే బ‌యట నిల్వ చేసిన గుడ్డు తెల్ల‌సొన చాలా రుచిగా ఉంటుంది. గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఉంచిన గుడ్ల‌తో పోలిస్తే ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు త్వ‌ర‌గా కుళ్లిపోతాయి. ఫ్రిజ్ లో నిల్వ చేసిన గుడ్లు పుల్ల‌టి రుచిగా అనిపిస్తాయి. కావున గుడ్ల‌ను గది ఉష్ణోగ్ర‌త నిల్వ చేయ‌డ‌మే మంచిది. గ‌ది ఉష్ణోగ్ర‌త నిల్వ చేసిన గుడ్ల‌ను, ఫ్రిజ్ లో ఉంచిన గుడ్ల‌ను పోలిస్తే ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు ఘ‌నీభ‌వానికి గురి అయ్యి పెంకుపై బ్యాక్టీరియా అభివృద్ది చెందే అవ‌కాశం ఉంది. ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనారోగ్యానికి గురి అయ్యే అవ‌కాశం చాలా ఉంది.

తాజా గుడ్ల‌ను ఫ్రిజ్ లో ఉంచాల్సిన అవ‌స‌రం లేదు. స‌క్ర‌మ‌ణ గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద సాల్మ‌నెల్లా సోకిన గుడ్డు ప‌క్క‌కు ఉంచిన గుడ్డు కూడా వైర‌స్ కు గురిఅవుతుంది. ఫ్రిజ్ లో ఉంచ‌డం వ‌ల్ల ఇలాంటి సంక్ర‌మ‌ణ‌కు గురి కాకుండా చూసుకోవ‌చ్చు. నిజానికి తాజా గుడ్లను రెండురోజుల లోపే తిన‌డం చాలా మంచిది. గుడ్డును ఫ్రిజ్ లో ఉంచ‌డం లాభ‌దాయ‌క‌మే అయిన కొంత‌వ‌ర‌కు మంచిది కాద‌నే చెప్పాలి.

D

Recent Posts