Common Cold : జ‌లుబు నుంచి త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నాన్ని అందించే.. ఈ చిట్కాల గురించి మీకు తెలుసా..?

Common Cold : ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ద‌గ్గు, జ‌లుబు బారిన ప‌డుతుంటారు. వాతావ‌ర‌ణ మార్పులు, కాలుష్యం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వీటి బారిన ప‌డుతతుంటాం. జలుబు వ‌ల్ల ముక్కు రంధ్రాలు మూసుకుపోతాయి. జలుబుతో పాటు ద‌గ్గు, త‌ల‌నొప్పి వ‌చ్చి చాలా ఇబ్బంది ప‌డుతుంటాం. పొడి ద‌గ్గు ప‌గటిపూట కంటే రాత్రి పూట ఎక్కువ‌గా వస్తుంది. నిద్ర‌ప‌ట్టకుండా చాలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. చాలా మంది జ‌లుబు, ద‌గ్గుల నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి యాంటీ బ‌యాటిక్స్ ను, ద‌గ్గు సిర‌ప్ ల‌ను వాడుతూ ఉంటారు. ఇవి కాకుండా ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి కూడా జ‌లుబు, ద‌గ్గుల నుండి ఉప‌వ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

ద‌గ్గు, జ‌లుబుల‌ను త‌గ్గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి ప‌డుకునే ముందు కొద్దిగా వామును తీసుకుని న‌మిలి నోట్లో బుగ్గ‌న పెట్టుకుని దాని నుండి వ‌చ్చే రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ద‌గ్గు రాకుండా ఉంటుంది. అలాగే దాల్చిన చెక్క‌ను ఉప‌యోగించి కూడా మ‌నం ద‌గ్గు, జ‌లుబుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఒక గిన్నెలో దాల్చిన చెక్క పొడిని తీసుకోవాలి. త‌రువాత దానిలో తేనెను క‌లిపి తీసుకోవాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా రోజూ తీసుకోవ‌డం వల్ల జ‌లుబు, ద‌గ్గుల నుండి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. జ‌లుబు ఇబ‌బ్ంది పెడుతున్న‌ప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా అల్లం ర‌సాన్ని తీసుకోవాలి. త‌రువాత అందులో నిమ్మ‌ర‌సం, తేనె వేసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల జలుబు త్వ‌ర‌గా త‌గ్గుతుంది. అంతేకాకుండా దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

natural home remedies to get immediate relief from Common Cold
Common Cold

జలుబు ఎక్కువ‌గా ఉండి ముక్కు రంధ్రాలు మూసుకుపోయిన‌ప్పుడు ఒక గిన్నెలో వేడి నీటిని పోసి దానిలో ప‌సుపు, విక్స్ లేదా జండుబామ్ వేసి ఆవిరి ప‌ట్టాలి. ఇలా చేడం వ‌ల్ల జ‌లుబు నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అదేవిధంగా ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడాయ్య‌క తుల‌సి ఆకులు వేసి మ‌రిగించాలి. త‌రువాత ఈ క‌షాయాన్ని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ క‌షాయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు రెండు త‌గ్గుతాయి. అలాగే అల్లం నీటిని తీసుకున్నా కూడా మ‌న‌కు జ‌లుబు, ద‌గ్గుల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఈ అల్లం టీ ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడాయ్య‌క అల్లం ముక్క‌ల‌ను క‌చ్చా ప‌చ్చ‌గా దంచి వేయాలి. త‌రువాత ఈ నీటిని బాగా మ‌రిగించాలి.

ఇప్పుడు ఈ నీటిని వ‌డ‌కట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల అల్లం టీ త‌యార‌వుతుంది. ఈ టీ ని తాగిన కూడా మ‌నం జ‌లుబు, ద‌గ్గుల నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఒక గిన్నెలో మిరియాల పొడి, తేనె వేసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు తీవ్ర‌త త‌గ్గుతుంది. జలుబు, ద‌గ్గు ఎక్కువ‌గా బాధ‌పెడుతున్న‌ప్పుడు వేడి పాల‌ల్లో ప‌సుపును వేసి క‌లిపి తాగాలి. ఇలా ప‌సుపు క‌లిపిన పాల‌ను రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా త్వ‌ర‌గా జ‌లుబు, ద‌గ్గుల నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

D

Recent Posts