Energy Foods : మనం ఏ పనులు చేసుకోవాలన్నా మన శరీరంలో తగినంత శక్తి ఉండాల్సిందే. శక్తి ఉంటేనే మనం పనులు చేసుకోగలుగుతాము. అయితే కొందరు ఎప్పుడూ చూసిన నీరసంగా ఉంటారు. వారి పనులను వారే చేసుకోలేపోతారు. మనం ఎల్లప్పుడూ ఉత్సాహాంగా, శక్తివంతంగా ఉండాలంటే మనం మన శరీరానికి మూడింటిని అందించాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని అందించడం వల్ల మన శరీరానికి తగినంత శక్తి లభించి మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. ఇందులో మొదటిది మనసు. మనసు ప్రశాంతంగా ఉంటే మన శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, చికాకు, కోపం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే శరీరంలో శక్తి తగ్గిపోతుంది.
చికాకు, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు శరీరంలో కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి విడుదల అవ్వడం వల్ల రక్తనాళాలు ముడుచుకుపోతాయి. శరీరంలో ఆక్సిజన్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. దీంతో శరీరంలో శక్తి తగ్గి నీరసం మన దరి చేరుతుంది. కనుక మనం ఎల్లప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ పాజిటివ్ థికింగ్ చేయాలి. నిరుత్సాహానికి గురి కాకుడదు. దీంతో మనం శక్తివంతంగా, ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. ఇక రెండవది నిద్ర. రోజూ కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. ఇలా నిద్రపోవడం వల్ల అవయవాలన్నింటికి విశ్రాంతి లభిస్తుంది. దీంతో మనం మరుసటి రోజూ ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల మన శరీరంలో విడుదలైన విష పదార్థాలు, రసాయనాలన్నింటిని శరీరం తొలగిపోయేలా చేస్తుంది.
దీంతో శరీరం మరింత శక్తివంతంగా పని చేస్తుంది. ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాలకు చక్కటి విశ్రాంతి లభించి తిరిగి శక్తివంతంగా పని చేయగలుగతాయి. కనుక మనం ప్రతిరోజూ 7 నుండి 8 గంటల పాటు నిద్ర పోవాలి. ఇక మూడవది చక్కటి ఆహారం. శరీరానికి బలాన్ని ఇచ్చే ఆహారాలను తీసుకోవడం వల్ల మనం శక్తివంతంగా పని చేసుకోగలుగుతాము. పల్లీలు, పచ్చి కొబ్బరి, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, పుచ్చగింజల పప్పు వంటి వాటిని తీసుకోవాలి. అలాగే జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా పప్పు, వాల్ నట్స్ వంటి వాటిని తీసుకోవాలి. ఈ పప్పులను నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల శరరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది. ఈ విధంగా ఈ మూడింటిని మన శరీరానికి అందించడం వల్ల మన శరీరానికి తగినంత శక్తి లభించి మనం ఉత్సాహంగా పని చేసుకోగలుగుతామని నిపుణులు చెబుతున్నారు.