Chia Seeds : చిన్నారులు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలని.. ఎలాంటి వ్యాధులు వారికి రావొద్దని తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. అయితే చాలా మంది తమ పిల్లలకు ఎలాంటి ఆహారం తినిపించాలి అనే విషయంలో సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. కానీ చిన్నారులకు తినిపించాల్సిన అనేక ఆహారాలు ఉన్నాయి. వాటిల్లో చియా సీడ్స్ ఒకటి. వీటిని పిల్లలకు తినిపించడం వల్ల అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు.

చిన్నారులకు కాల్షియం అధికంగా అవసరం ఉంటుంది. ఇది వారిలో ఎముకల పెరుగుదలకు, దృఢత్వానికి అవసరం అవుతుంది. కనుక కాల్షియం ఉండే ఆహారాలను వారికి రోజూ ఇవ్వాలి. అలాంటి ఆహారాల్లో చియా సీడ్స్ ఒకటి. వీటిని కనీసం వారంలో రెండు సార్లు అయినా సరే పిల్లలకు తినిపించాలి. రాత్రి పూట గుప్పెడు చియా సీడ్స్‌ను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాటిని పిల్లలకు బ్రేక్ ఫాస్ట్‌లో తినిపించాలి. ఇలా వారంలో రెండు సార్లు తినిపిస్తే చాలు.. కాల్షియం బాగా లభిస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.
పిల్లలకు ఆ వయస్సులో సహజంగానే జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉండాలి. కానీ కొందరు తాము నేర్చుకున్న, తెలుసుకున్న వాటి గురించి మరిచిపోతుంటారు. ఇలా జరగడం వల్ల వారు చదువుల్లో రాణించలేరు. కానీ చియా సీడ్స్ ను వారికి తినిపిస్తే.. వాటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చిన్నారుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతాయి. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చదువుల్లో రాణిస్తారు. కాబట్టి వారి ఆహారంలో చియా సీడ్స్‌ను తప్పక చేర్చాలి.
చియా సీడ్స్‌ను పిల్లలకు తినిపించడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.
చిన్నారులకు చియాసీడ్స్‌ను అనేక విధాలుగా తినిపించవచ్చు. పైన తెలిపిన విధంగా వాటిని నీటిలో నానబెట్టి తినిపించవచ్చు. అలాగే పెరుగులో వాటిని కలిపి లేదా వాటి పొడిని కలిపి ఇవ్వవచ్చు. ఎలాగైనా సరే వారు వారంలో రెండు సార్లు ఈ సీడ్స్‌ను తినేలా చూసుకుంటే చాలు.. అనేక ప్రయోజనాలను పొందవచ్చు.