హెల్త్ టిప్స్

Fennel Seeds Water : సోంపు వాటర్ ఇలా తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు వెంటనే కరిగిపోతుంది.. మీరు ట్రై చేయండి..

Fennel Seeds Water : సోంపు గింజలు చూడటానికి చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ చిన్న ధాన్యాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సోంపులో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ బరువు తగ్గలేని వారికి సోంపు ఒక వరం లాంటిది. దానిని తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా కరుగుతాయి. బరువు తగ్గడం సులభమవుతుంది. కొంతమంది మహిళలు పీరియడ్స్‌లో భరించలేని నొప్పిని అనుభవిస్తారు.

అలాంటి మహిళలు సోంపు నీరు తాగాలి. దీనిని తీసుకోవడం ద్వారా నొప్పి తగ్గుతుంది. అలాగే సోంపూ అనేది భోజనం తర్వాత తినే ఓ పదార్థంగానే భావిస్తారు చాలామంది. కానీ తీసుకున్న ఆహారాన్ని సకాలంలో సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుందని చాలామందికి తెలీదు. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడంలో సోంపు దిట్ట. అందుకే సోంపు ఇంట్లో ఉండే ఔషది అని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా చేయండి: 2 స్పూన్ల సోంపు, 1 గ్లాస్ వాటర్.

fennel seeds water many wonderful health benefits

సోంపుగింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని వడగట్టి పొద్దున్నే పరగడపున తాగాలి. సోంపూ వాటర్ లో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇది బాడీలో మెటబాలిజం రేట్ పెంచుతుంది. దీంతో జీర్ణం త్వరగా అయిపోయి క్యాలరీలు శక్తిగా మారతాయి. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోయి శరీరం నాజూగ్గా తయారవుతుంది. సోంపు తిన్న ఫలితంగా ఆకలి తగ్గిపోతుంది. టాక్సిన్ ఫ్లష్ అవుట్ చేస్తుంది. బ్లడ్ ని ఫ్యూరిఫై చేస్తుంది. నోటి దుర్వాసనను అరికడుతుంది.

Admin

Recent Posts