Flax Seeds Laddu : ఈ ల‌డ్డూల‌ను ఇలా త‌యారు చేసి తినండి.. గుండె జ‌బ్బులు, షుగ‌ర్ రావు..!

Flax Seeds Laddu : చ‌లికాలం రానే వ‌చ్చింది. రోజురోజుకు ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుతున్నాయి. అలాగే చ‌లికాలం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా తీసుకు వ‌స్తుంది. శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉండే అనారోగ్య స‌మ‌స్య‌లు చ‌లికాలంలో మ‌రింత ఎక్కువ అవుతాయి. జీర్ణ‌శ‌క్తి మంద‌గిస్తుంది. కీళ్ల నొప్పులు మ‌రింత ఎక్కువ‌గా అవుతాయి. క‌నుక మ‌నం చ‌లికాలంలో ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఆహారాల‌ను, శరీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను, కీళ్ల నొప్పులను త‌గ్గించే ఆహారాల‌ను తీసుకోవాలి. ఇలా వివిధ ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డానికి బ‌దులుగా చాలా సుల‌భంగా ఒక ల‌డ్డూను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. చ‌లికాలంలో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి మ‌నం చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

ఈల‌డ్డూల‌ను చ‌లికాలంలో రోజుకు ఒక‌టి తీసుకుంటే చాలు మనం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. చ‌లికాలంలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అలాగే ఈ ల‌డ్డూల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈల‌డ్డూల‌ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం 4 టేబుల్ స్పూన్ల అవిసె గింజ‌ల‌ను, ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుమును, 100 గ్రాముల జీడిప‌ప్పును, 100 గ్రాముల బాదంప‌ప్పును, ఒక టేబుల్ స్పూన్ల ఎండుద్రాక్ష‌ను, అర టీ స్పూన్ యాల‌కుల పొడిని,త‌గినంత నెయ్యిని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా క‌ళాయిలో జీడిప‌ప్పు, బాదంప‌ప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించాలి. త‌రువాత అవిసె గింజ‌లు వేసి వేయించాలి.

Flax Seeds Laddu make this way take daily for many benefits
Flax Seeds Laddu

త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌గా కాకుండా బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత బెల్లం, యాల‌కుల పొడి వేసి మ‌రోసారి మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ ల‌డ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అవిసె గింజ‌ల ల‌డ్డూలు త‌యార‌వుతాయి. ఇలా త‌యారు చేసిన ల‌డ్డూల‌ను రోజుకు ఒక‌టి తిన‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త తగ్గుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి.

కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చ‌లికాలంలో వ‌చ్చే ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఈ ల‌డ్డూల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య తగ్గుతుంది. అంతేకాకుండా ఈ ల‌డ్డూల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. ఈ విధంగా అవిసె గింజ‌ల‌తో ల‌డ్డూల‌ను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని చ‌లికాలంలో వ‌చ్చే అనారోగ్య స‌మస్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts