Brain Health : మీరు రోజూ ఈ 9 ప‌నులు చేస్తే చాలు.. వృద్ధాప్యంలోనూ మీ మెద‌డు షార్ప్‌గా ప‌నిచేస్తుంది..!

Brain Health : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మెద‌డు ఒక‌టి. మ‌న శ‌రీరం మొత్తం మ‌న మెద‌డు ఆధీనంలోనే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌నం మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని ఎంత జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటామో మెద‌డు ఆరోగ్యాన్ని కూడా అంతే జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. మెద‌డు ఆరోగ్యంగా ఉండాలంటే త‌గిన ఆహారాల‌ను తీసుకుంటే మాత్ర‌మే సరిపోదు. మ‌న జీవ‌నశైలిలో, మ‌న అల‌వాట్ల‌ల‌ల్లో కూడా మార్పులు చేసుకోవాలి. మెద‌డు ఆరోగ్యంగా, చురుకుగా, ప‌దునుగా ఉండాలంటే మ‌నం చేయ‌వ‌ల‌సిన ప‌నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిరంత‌రం ఫోన్లు, టివిలు చూడ‌డం వ‌ల్ల క‌ళ్ల‌తో పాటు మెద‌డుపై కూడా ఒత్తిడి ఎక్కువ‌గా ప‌డుతుంది. క‌నుక మెద‌డుకు త‌గిన విశ్రాంతిని ఇవ్వాలి. ఫోన్ ల‌ను చూడ‌డం మానేసి వాకింగ్ చేయ‌డం, కుటుంబ స‌భ్యుల‌తో గ‌డ‌ప‌డం, ప్ర‌కృతిని ఆస్వాదించ‌డం వంటివి చేయాలి. దీంతో మెద‌డుకి విశ్రాంతి ల‌భిస్తుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండాలి.

ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డానికి గానూ శ్వాస వ్యాయామాలు, యోగా వంటివి చేయాలి. దీంతో మెద‌డు ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు అభిజ్ఞా ప‌నితీరు కూడా మెరుగుప‌డుతుంది. అలాగే మెద‌డు ఆరోగ్యంగా ఉండ‌డానికి గానూ స‌మ‌తుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, లీన్ ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, పండ్లు, కూర‌గాయ‌లు, తృణ ధాన్యాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ఇవ‌న్నీ కూడా మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ముఖ్య‌పాత్ర పోషిస్తాయి. అలాగే మెద‌డు చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 7 నుండి 9 గంట‌ల పాటు నిద్ర‌పోవ‌డం చాలా అవ‌స‌రం. రోజూ ఒకే స‌మయానికి ప‌డుకోవ‌డం, మేల్కొవ‌డం వంటి దిన‌చ‌ర్య‌ను పాటించ‌డం వ‌ల్ల మెద‌డు మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తుంది. ఇక మ‌న శ‌రీరానికి వ్యాయామం ఎంత అవ‌స‌ర‌మో మెద‌డుకి కూడా వ్యాయామం అంతే అవ‌స‌రం. దీని కోసం ప‌జిల్స్, క్రాస్ వ‌ర్డ్స్, సుడోకు వంటివి ఆడాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నాడీ సంబంధాలు మెరుగుప‌డ‌తాయి.జ్ఞాప‌క శ‌క్తి, అభిజ్ఞా పనితీరు మెరుగుప‌డుతుంది. అలాగే స్నేహితులు, కుటుంబ స‌భ్యులు, ఇష్ట‌మైన వారితో స‌మ‌యాన్ని ఎక్కువ‌గా గ‌డ‌పాలి.

follow these 9 tips daily to keep your Brain Health in optimal condition
Brain Health

దీంతో ఒత్తిడితో త‌గ్గ‌డంతో పాటు మాన‌సిక స్థితి మెరుగుప‌డుతుంది. ఇవి మెద‌డును ప‌దునుగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.అలాగే మ‌ద్య‌పానం, ధూమ‌పాపం వంటి అల‌వాట్ల‌ను మానేసి మంచి జీవ‌న‌శైలిని అల‌వాటు చేసుకోవాలి. రోజూ వ్యాయామం చేయ‌డం, ధ్యానం చేయ‌డం వంటి అల‌వాట్లు చేసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అలాగే పుస్త‌కాలు చ‌దివే అల‌వాటు కూడా చేసుకోవాలి. మ‌న‌కు న‌చ్చిన పుస్త‌కాలు చ‌ద‌వ‌డం వ‌ల్ల మెద‌డుకు వ్యాయామంగా ఉండ‌డంతో పాటు మ‌న జ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవ‌చ్చు. అదేవిధంగా త‌ల‌కు గాయాలు త‌గ‌ల‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. బైక్ రైడ్, స్కేటింగ్ వంటివి చేసేట‌ప్పుడు త‌ల‌కు హెల్మెట్ ధ‌రించ‌డం, కారులో ప్ర‌యాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ వంటివి ధ‌రించ‌డం వ‌ల్ల ప్ర‌మాదాల తీవ్ర‌త త‌గ్గుతుంది. త‌ల‌కు దెబ్బ‌త‌గిలిన‌ప్ప‌టికి మెద‌డుకు గాయం కాకుండా ఉంటుంది. ఈ విధంగా మ‌న అల‌వాట్ల‌ల్లో మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డంతో పాటు మెద‌డు ప‌నితీరును, జ్ఞాప‌క‌శ‌క్తిని కూడా పెంచుకోవ‌చ్చ‌ని, మెద‌డు ఎల్ల‌ప్పుడూ చురుకుగా ఉండేలా చూసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts