హెల్త్ టిప్స్

శ‌రీరంలోని వేడి త‌గ్గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది ఎదుర్కునే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో శరీరం వేడి అవ్వడం కూడా ఒకటి&period; కొంతమందికి వేడి చేసే ఆహారపదార్ధాలు అంటే బాగా మసాలా దినుసులతో కూడిన ఆహారం గాని&comma; బాగా స్పైసిగా ఉంటే ఫుడ్ గాని తింటే వెంటనే వేడి చేస్తుంది&period; కొంతమందికి చికెన్ తిన్నగాని వేడి చేస్తుంది&period; గొంతులో నొప్పి ఉండటం&comma; మూత్రానికి వెళ్ళినప్పుడు మంటగా ఉండడం&comma; మలబద్ధకం&comma; తల నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి&period; అలాంటప్పుడు ఒక్కోసారి ఏమిచేయాలో కూడా తెలియని పరిస్థితి&period; అందుకనే వేడి చేసినప్పుడు మెడిసిన్‌‌ పై ఆధార పడకుండా సహజంగానే శరీరం యొక్క వేడి సమస్య ను తగ్గించుకోవాలి&period; అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తరుచుగా మనం తీసుకునే ఆహారపు అలవాట్లతో శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించవచ్చు&period; ముందుగా శరీరంలో వేడి తగ్గాలంటే ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి&period; ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి&period; అది ఏంటంటే ఫ్రిజ్ లో పెట్టిన నీరు తాగకూడదు&period; కొంతమందికి ఫ్రిడ్జ్ లో నీరు తగిన గాని వేడిచేస్తుంది&period; అందుకే మామూలు నీటిని మాత్రమే తీసుకోవాలి&period; వేడిని తగ్గించడంలో నీరు పనిచేసినట్టుగా మరి ఏది పని చేయదు&period; అలాగే వేడి తగ్గాలంటే మజ్జిగ&comma; కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి&period; ఇలా తాగుతుంటే నెమ్మదిగా వేడి తగ్గుతుంది&period; అలాగే సగ్గు బియ్యం జావ కూడా వేడి తగ్గడానికి మంచి మార్గం&period; సగ్గుబియ్యం నానపెట్టి&comma; తరువాత ఉడికించి అందులో పాలు పోయకుండా బెల్లం వేసుకుని తాగితే వేడి తగ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72941 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;heat-in-body&period;jpg" alt&equals;"follow these home remedies if you have heat in body " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కర్బూజా పండ్లకు చలవ చేసే గుణం అధికం&period; కర్బూజా పండు మందపాటి తోలు తీసేసి&comma; చిన్న ముక్కలుగా తరిగి&comma; పంచదార చల్లుకుని తింటే క్షణాలలో వేడి తగ్గుతుంది&period; అరటి పళ్లు&comma; పుచ్చకాయ&comma; పైనాపిల్&comma; గసగసాలు&comma; ఎండుద్రాక్ష&comma; చలవచేసే వాటిలో చాలా ముఖ్యమైనవి&period; అలాగే ఎండు ఖర్జురం కూడా వేడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది&period; ఒక మూడు లేదా నాలుగు ఎండు ఖర్జురాలను తీసుకుని రాత్రంతా శుభ్రమైన నీటిలో నానపెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే వేడి తగ్గుతుంది&period; వీటితో పాటు గ్లాసు వేడిపాలు తీసుకుని అందులో 2 లేక 3 చిన్న చిన్న పచ్చకర్పూరం పలుకులు&comma; కొంచెం యాల‌కుల పొడి&comma; తగినంత గసగసాల పొడి కలుపుకుని రాత్రి పడుకోబోయే ముందు తాగితే వేడి మాయమవుతుంది&period; అలాగే మంచి నిద్ర కూడా పడుతుంది&period; మీరు ఎటువంటి ఆహార పదార్ధాలు తింటే శరీరంలో వేడి ఎక్కువ అవుతుందో అటువంటి ఆహార పదార్ధాలకు దూరంగా ఉండడం మంచిది&period; ఒకవేళ తిన్నగాని పైన చెప్పిన చిట్కాలు పాటించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts