హెల్త్ టిప్స్

కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయా..? ఆహారంతోనే జాగ్ర‌త్త‌లు తీసుకోండి..!

వేసవి కాలం మొదలవుతుంది కాబట్టి శరీరంలో ఉండే నీటి శాతం తగ్గిపోయి అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా కిడ్నీల‌కి సంబంధించి అనేక సమస్యల్లో ప్రధానమైనది కిడ్నీలో రాళ్లు. ఒక సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. అయితే దీనికి పరిష్కారం ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్తపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వేసవి కాలంలో శరీరంలోని నీరు అంతా చెమట రూపంలో బయటకు వెళ్లి పోవడంతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. అందుకే ఈ రోజుల్లో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుని, రోజు మొత్తం మీద కనీసం ఐదు లీటర్ల నీటిని తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. దాహం తీర్చుకోవడానికి ఈ రోజుల్లో అందరు శీతల పానీయాలకు అలవాటు పడిపోయారు. వీటివల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. పళ్ళ రసాలలో ముఖ్యంగా ద్రాక్ష రసం మానేస్తే మంచిది.

if you have kidney stones follow these tips in diet

వాటికి బదులుగా అప్పటికప్పుడు తయారు చేసుకున్న నిమ్మ రసం తాగడం మంచిది. వీలైనంత వరకు ఆహారంలో ఉప్పు, కాల్షియం తక్కువగా ఉండే ఆహారాలనే తీసుకోవాలి. అంటే పాలకూర,వేరుశనగ కాయలు,పప్పు, బీన్స్, చాక్లెట్స్, కాఫీ, టీ లు తగ్గించాలి. అలాగే మెగ్నీషియం, మినరల్స్ సాధ్యమైనంత తక్కువ తీసుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు దాహం తీర్చుకోవడానికి పళ్ళ రసాలు తాగడం కూడా అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

Admin

Recent Posts