Liver Clean Tips : లివ‌ర్‌ను పూర్తిగా శుభ్రం చేసుకోవాలా.. అయితే ఇలా చేయండి..!

Liver Clean Tips : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌యవాల్లో కాలేయం కూడా ఒక‌టి. మ‌న శ‌రీరంలో గుండె కంటే కూడా ఎక్కువ ప‌నుల‌ను కాలేయం నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరం నుండి మ‌లినాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డం, ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డాన్ని నియంత్రించ‌డం, శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే కొలెస్ట్రాల్ ను త‌యారు చేయ‌డం, మ‌నం తిన్న ఆహారం నుండి పోష‌కాల‌ను వేరు చేయ‌డం వంటి వివిధ ర‌కాల విధుల‌ను కాలేయం నిర్వ‌ర్తిస్తుంది. దాదాపు 500 ర‌కాల విధుల‌ను కాలేయం ప్ర‌తిరోజూ నిర్వ‌ర్తిస్తుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజు రోజుకూ ఎక్కువవుతోంది.

కాలేయం వాపు, కామెర్లు, హెప‌టైటిస్ ఎ, బి, సి, డి, ఇ ల‌తోపాటు ఫ్యాటీ లివ‌ర్, కాలేయంలో గ‌డ్డ‌లు, కాలేయ క్యాన్స‌ర్ వంటి ర‌క‌ర‌కాల కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా కాలేయాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం తీసుకునే ఆహారం, మ‌న జీవ‌న శైలి మీద‌నే మ‌న కాలేయం ప‌నితీరు, ఆరోగ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. కాలేయం ఆక‌స్మాత్తుగా పాడ‌వ‌దు. కొద్ది రోజుల నుండి స‌మ‌స్య ఉన్న త‌రువాత‌నే మ‌నలో ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌కు క‌న‌డ‌బ‌తాయి.

follow these Liver Clean Tips for better health
Liver Clean Tips

శ‌రీరంలో ఏ ఇత‌ర అవ‌యావాలు పాడైనా వాటిని న‌యం చేసుకోవ‌డం చాలా క‌ష్టం. కానీ కాలేయాన్ని మాత్రం మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. తిరిగి ఆరోగ్య‌వంతంగా మార్చుకోవ‌చ్చు. దీని కోసం మ‌నం ఎల్ల‌ప్పుడూ మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే వ్యాయామం చేస్తూ ఉండాలి. శ‌రీర బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉండాలి. మ‌ద్య‌పానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. అదేవిధంగా ప్ర‌తిరోజూ 8 గంట‌లు త‌ప్ప‌కుండా నిద్ర‌పోవాలి. మ‌నం తీసుకునే ఆహారాన్ని కూడా స‌రైన స‌మ‌యానికి తీసుకోవాలి.

నీటిని ఎక్కువ‌గా తాగుతూ ఉండాలి. అలాగే మ‌నం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఆహారాల‌ను తీసుకోవాలి. కొవ్వు ప‌దార్థాలు త‌క్కువ‌గా ఉండే ఆహారాన్ని, జంక్ ఫుడ్ ను త‌క్కువ‌గా తీసుకోవాలి. అదే విధంగా ఆకు కూర‌ల‌ను ముఖ్యంగా పాల‌కూర‌ను మ‌న ఆహారంలో భాగంగా తీసుకోవాలి. క్యారెట్, బీట్ రూట్, నిమ్మ‌ర‌సం, గ్రీన్ టీ, ప‌సుపు, అవ‌కాడో, వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్ వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయం శుభ్ర‌పడుతుంది. ఈ ఆహార ప‌దార్థాల‌ను తీసుకుంటూ చ‌క్క‌ని జీవ‌న శైలిని పాటించ‌డం వ‌ల్ల కాలేయ స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతోపాటు భ‌విష్య‌త్తులో రాకుండా కూడా ఉంటాయి.

D

Recent Posts