Natural Energy Drink : నీర‌సంగా, బ‌ల‌హీనంగా ఉన్న‌వారు తాగాల్సిన డ్రింక్‌.. వెంట‌నే ప‌రిగెడ‌తారు..!

Natural Energy Drink : మ‌న‌లో చాలా మంది కొద్ది దూరం న‌డ‌వ‌గానే ఆయాస పడిపోతుంటారు. కొద్ది స‌మ‌యం ప‌ని చేయ‌గానే ఆల‌సిపోతుంటారు. అలాగే బరువుల‌ను ఎత్త‌లేక‌పోతుంటారు. దీనికి కార‌ణం మ‌న శ‌రీరంలో త‌గినంత శ‌క్తి లేక‌పోవ‌డ‌మే అని నిపుణులు చెబుతున్నారు. మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడి, భోజ‌నం స‌రిగ్గా తిన‌క‌పోవ‌డం, పోష‌కాహార లోపం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల కొంద‌రిలో ఎప్పుడూ అల‌స‌ట‌గా, నీర‌సంగా ఉంటుంది. అలాంటి వారు వారి ప‌ని కూడా వారు చేసుకోలేక‌పోతుంటారు. ప‌ని చేయ‌డానికి వారు ఉత్సాహం చూపించ‌రు. శ‌రీరంలో త‌గినంత శ‌క్తిలేక ఇబ్బంది ప‌డ‌తున్న‌వారు స‌హ‌జసిద్ధంగానే ఇంట్లోనే ఒక డ్రింక్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భించ‌డంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.

శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని ఇచ్చే ఈ డ్రింక్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరానికి త‌గినంత శ‌క్తిని ఇచ్చే ఈ డ్రింక్ ను త‌యారు చేసుకోవ‌డానికి గాను మ‌నం ఒక టేబుల్ స్పూన్ వాల్ న‌ట్స్ ను, ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష‌ను, ఒక గ్లాస్ పాల‌ను, త‌గినంత తేనెను లేదా ప‌టిక బెల్లాన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో పాల‌ను పోసి వేడి చేయాలి. పాలు వేడ‌య్యాక వాల్ న‌ట్స్ ను, ఎండు ద్రాక్ష‌ను వేసి మ‌రో 5 నిమిషాల పాటు మ‌రిగించాలి. ఇలా మ‌రిగించిన త‌రువాత పాల‌ను గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ పాలల్లో తేనెను లేదా ప‌టిక‌ బెల్లాన్ని వేసి క‌లుపుకోవాలి. పంచ‌దార‌ను మాత్రం మ‌నం ఉప‌యోగించ‌కూడ‌దు.

Natural Energy Drink make in this way and drink for 3 days
Natural Energy Drink

ఇలా త‌యారు చేసుకున్న ఈ డ్రింక్ ను ఉద‌యం పూట‌ మాత్ర‌మే తాగాలి. రాత్రి పూట తాగ‌కూడ‌దు. ఉద‌యం ప‌ర‌గ‌డుపున లేదా మ‌ధ్యాహ్న భోజ‌నానికి ముందు తీసుకోవాలి. పాల‌ల్లో ఉండే డ్రై ఫ్రూట్స్ ను తింటూ పాల‌ను తాగాలి. ఈ విధంగా 3 రోజుల పాటు చేయ‌డం వల్ల నీర‌సం, అల‌స‌ట త‌గ్గి చురుకుగా ప‌నులు చేసుకోగ‌లుగుతారు. అంతేకాకుండా ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల మాన‌సిక ఒత్తిడి, న‌రాల బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అధిక ర‌క్త‌పోటుతోపాటు దీర్ఘ‌కాలిక వ్యాధులు కూడా నియంత్ర‌ణ‌లో ఉంటాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది.

ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల స్త్రీల‌లో వ‌చ్చే సంతాన‌లేమి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ప‌క్క త‌డిపే అల‌వాటు ఉన్న పిల్ల‌లకు ఈ డ్రింక్ ను వారం రోజుల పాటు ఇవ్వాలి. ఈ వారం రోజుల్లో వారికి పెరుగు, పాల వంటి వాటిని ఇవ్వ‌కూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల పిల్ల‌ల్లో ప‌క్క త‌డిపే అల‌వాటు న‌యం అవుతుంది. ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం వంటి జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. నిద్ర‌లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. లైంగిక సామ‌ర్థ్యం, వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉన్న పురుషులు ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

D

Recent Posts