హెల్త్ టిప్స్

ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా ఉండాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

యవ్వనం.. మనం కలల్ని నిజాలుగా మార్చుకునేది ఈ దశలోనే. మనకేమీ తెలియకుండానే చిన్నతనమంతా గడిచిపోతుంది. మధ్యవయసులోకి వచ్చాక అనేక బాధ్యతలు మీద పడతాయి. అదీగాక వయసు పెరుగుతున్నవాళ్లని సమాజం పెద్దగా పట్టించుకోదు. అందుకే వయసైపోతుందని ఎవరైనా అన్నారంటే భయపడిపోతుంటారు. ఐతే వయసెంత పెరుగుతున్నా నిత్యయవ్వనంగా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. శారీరక పెరుగుదలలో కనిపించే వయసు మనసు మీద బాగా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే అందరూ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. నిత్యయవ్వనంగా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి.

వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియ తగ్గిపోతుంది. అంటే తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ వేగం తగ్గిపోతుంది. దాని వల్ల బరువు పెరుగుతుంది. అందువల్ల ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియ కంట్రోల్ ఉండి ఆ ఆహారం శక్తిగా మారుతుంది. ఎండ శరీరానికి మంచిదే. కానీ అతిగా ఎండలో పని చేయడం మంచిది కాదు. దానివల్ల చర్మంపై ముడుతలు ఏర్పడుతాయి. దానివల్ల తొందరగా వృద్ధాప్యం వస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి. స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ వాడటం మంచిది. మాయిశ్చరైజర్ వల్ల చర్మం పొడిబారకుండా తేమగా, ఎక్కువకాలం యవ్వనంగా ఉంటుంది.

follow these tips for younger look always

మన ఆహారంలో ఎక్కువభాగం పండ్లు కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. వీటిని మన ఆహరంలో భాగం చేసుకోవడం వల్ల మన చర్మం మునుపటి కంటే అందంగా తయారవుతుంది. రోజంతా పనిచేస్తూ ఉన్న శరీరానికి విశ్రాంతి అవసరం. నిద్రని మించిన విశ్రాంతి మరొకటి లేదు. నిత్యవయ్యవనంగా కనిపించాలంటే తగినంతగా నిద్రపోవాలి. ఐతే ఎప్పుడైనా సరే పొట్ట నేలకి ఆనేట్టుగా పడుకోకూడదు. వెల్లకిలా పడుకోవడం ఉత్తమం. వీటిని ఫాలో అయితే మీరు నిత్యం యవ్వనంగా కనబడతారు.

Admin

Recent Posts