హెల్త్ టిప్స్

వయస్సు తగ్గించుకునే చిట్కాలు ఇవిగో…?

వయ్సస్సు 40 దాటిందంటే చాలా మంది తాము పెద్దవాళ్లమవుతున్నామని ఫీలవుతారు. ఆ వయస్సు దాచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంకా కుర్రాళ్లలాగానే బిల్డప్ ఇవ్వాలనుకుంటారు. అయితే అందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వయస్సు కనిపించకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య పద్దతులు పాటించాలి. అవేటంటంటే..

ఆహారంలోకి తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకుకోండి. వీటిల్లో యాంటి యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మం వయస్సు పెరుగుదల ప్రక్రియ మందగించి, చర్మం ముడుతలు పడకుండా ఉంటుంది. విటమిడ్ డి చర్మానికి ఆరోగ్యాన్నివ్వడమే కాదు, వృద్ధాప్యఛాయల్ని నివారిస్తుంది. విటమిన్‌ డి సమృద్ధిగా ఉండే ఆహార పదార్ధాలతోపాటు విటమిన్‌ డి3 సప్లిమెంట్స్‌ను కూడా తీసుకోవాలి. నీటిలో కరిగే గుణం వున్న బీ కాంప్లెక్స్‌ మాత్రలు తీసుకోవచ్చు.

follow these tips for younger look

8 గ్లాసుల నీళ్ళు, 8 గంటల నిద్ర చాలా అవసరం. డీ హైడ్రేషన్‌ వల్ల కూడా చర్మం ఎండిపోయి ముడతలు పడుతుంది. అది శరీరంలో శక్తిని కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల ప్రతిరోజూ 6 నుంచి 8 గ్లాసుల నీళ్ళను తాగాలి. జీవిత కాలం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 6 – 8 గంటలు నిద్రపోవాలి. చక్కటి నిద్ర రోజంతా ఉత్సాహాన్నిస్తుంది. అలాంటి ఉత్సాహంవంతమైన జీవితం వృద్ధాప్యాన్ని దరిచేయనీయదు.

పని ఒత్తిడి శరీరంలో ఆండినలైన్‌, కోర్టిజాల్‌ వంటి హార్మోన్ల విడుదల అధికమై గుండెవేగం పెరిగి హైపర్‌ టెన్షన్‌కు దారితీస్తుంది. ఒత్తిడిని సాధ్యమైనంతమేర తగ్గించుకోవడంతోపాటు సంతోషంగా, ఆరోగ్యంగా జీవితం గడపాలి. అందుకోసం ధ్యానం లేదా యోగాను ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ కనీసం అర్దగంట సేపు ధ్యానం లేదా యోగా చేస్తే అది ఒత్తిడిస్థాయిని గణనీయంగా తగ్గించి, మనల్ని శక్తివంతం చేస్తుంది. మనం చలాకీగా, వయస్సు తక్కువ ఉన్నట్టు కనిపిస్తాం.

Admin

Recent Posts