Diabetes : ప్రస్తుత తరుణంలో చాలా మంది జీవనశైలి బిజీగా మారిపోయింది. అలాగే ఆహారపు అలవాట్లు కూడా డయాబెటిస్ వచ్చేందుకు కారణమవుతున్నాయి. దీంతో చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా షుగర్ వస్తోంది. అయితే షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే.. ఓ వైపు డాక్టర్ ఇచ్చే మందులను రెగ్యులర్‌గా వాడాలి. అలాగే కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. దీంతో షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. షుగర్ ఉన్నవారు సరైన జాగ్రత్తలను పాటించకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీలు, లివర్ పాడైపోతాయి. చూపు మందగిస్తుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక షుగర్ ఉన్నవారు నిర్లక్ష్యం చేయరాదు. తప్పనిసరిగా పలు జాగ్రత్తలను పాటించాలి.
ప్రతి రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి. కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ అయినా చేయాలి. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా షుగర్ కంట్రోల్ అవుతుంది. మరిన్ని సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే షుగర్ ఉన్నవారు ఎల్లప్పుడూ చెప్పులను ధరించాలి. బయటకు వెళ్తే కచ్చితంగా చెప్పులను వేసుకునే వెళ్లాలి. దీంతోపాటు రోజూ గోరు వెచ్చని నీళ్లతో కాళ్లను కడుక్కోవాలి. అలాగే గోర్లు తీసేటప్పుడు చిగుళ్లకు గాయాలు కాకుండా చూసుకోవాలి. గాయం అయితే త్వరగా మానదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. లేదంటే సమస్యలు వస్తాయి.
షుగర్ ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలను చేయించుకోవాలి. ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతుంటాయి. కాబట్టి తరచూ కొలెస్ట్రాల్‌తోపాటు బీపీ, కంటి, కిడ్నీ, లివర్ పరీక్షలను చేయించాలి. లేదంటే ఆయా అవయవాలు దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. తరువాత ఏం చేసినా ఫలితం ఉండదు. ఇక ఆహారం విషయంలోనూ తగిన జాగ్రత్తలను పాటించాలి. ముఖ్యంగా చిరు ధాన్యాలను అధికంగా తీసుకోవాలి. తెల్ల అన్నం తినరాదు. అలాగే పిండి పదార్థాలను తగ్గించి ప్రోటీన్లు, పీచు పదార్థాలను అధికంగా తీసుకోవాలి. దీంతో షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే టైముకు మందులను వేసుకోవడం, తగినంత నిద్ర పోవడం, రోజూ నీళ్లను కావల్సినన్ని తాగడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం.. వంటివి చేయాలి. ఈ జాగ్రత్తలను పాటిస్తే షుగర్ తప్పక కంట్రోల్‌లో ఉంటుంది. దీంతో ఎలాంటి తీవ్రమైన సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.