హెల్త్ టిప్స్

జీవప్రక్రియను రెట్టింపు చేసి బరువును తగ్గించే ఆహార పదార్థాలు ఇవే..

కొన్ని సార్లు జిమ్ లేదా వ్యాయామాలు చేసినప్పటికీ బరువు తగ్గదు. కారణం తీసుకునే ఆహార పదార్థాలు, ఇక్కడ తెలిపిన ఆహారాలను మీ ప్రణాళికలో కలుపుకొండి, ఎందుకంటే ఇవి మీ బరువు తగ్గించే ప్రక్రియను రెట్టింపు చేస్తాయి. బరువు తగ్గటానికి గ్రీన్ టీ ఒక అద్బుతమైన ఎంపిక అని చెప్పవచ్చు. గ్రీన్ టీ ‘పాలీ ఫినాల్స్’లను కలిగి ఉండి మన శరీరంలో ఉండే ట్రై-గ్లిసరైడ్స్’లను విచ్చిన్న పరుస్తుంది. అంతేకాకుండా, వ్యాయామాలు చేయటం వలన బరువు తగ్గటానికి కావలసిన సహనాన్ని పెంచుతుంది. ప్రతి సారి కప్పు గ్రీన్ తాగినపుడల్లా మీరు మంచి భావనను పొందుతారు. బరువు తగ్గే విషయానికి వస్తే, హోల్ గ్రైన్స్ ను మీ ఆహార ప్రణాళికలో కలుపుకోవటం ఉత్తమ చిట్కాగా పేర్కొనవచ్చు, ఇవి శరీరంలో కేలోరీలను కరిగించుటలో సమర్థవంతంగా పని చేస్తాయి.

బ్రోకలీ అనేది అద్బుతమైన, ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహరం మరియు క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేసే గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఎక్కువ మొత్తంలో ఫైబర్ స్థాయిలను కలిగి ఉండి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. మీరు తీసుకునే ఆహారంలో అధికంగా క్యాలోరీలు, కొవ్వులను అందించే ఆహారాల బదులుగా బ్రోకలీని కలుపుకోండి. బరువు తగ్గించుటలో సహాయపడే మరొక అద్బుతమైన ఆహారంగా నారింజ పండును చెప్పవచ్చు. ఎక్కువ క్యాలోరీలను అందించే డిషెస్’లకి బదులుగా నారింజ పండ్లను తినటం మంచిది. నారింజ పండులో అధిక మొత్తంలో ఫైబర్ మరియు విటమిన్ ‘C’లను కలిగి ఉండి, జీవక్రియ రేటును పెంచి ఆకలి అనిపించకుండానే శరీర బరువు తగ్గిస్తాయి.

follow these tips to increase metabolism

కారం, ప‌సుపుల‌ను మ‌నం వంట‌కాల్లో ఎక్కువ‌గా వాడాలి. ఇలా వాడితే వాటిలో ఉండే ఔష‌ధ గుణాలు కార్బొహైడ్రేట్ల‌ను నెమ్మ‌దిగా జీర్ణం చేస్తాయి. శ‌రీరం వాటిని త్వ‌ర‌గా శోషించుకోకుండా చూస్తాయి. దీంతోపాటు కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు.

Admin

Recent Posts