Foods For LDL : చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉందా.. అయితే వీటిని రోజూ తినండి..!

Foods For LDL : మారిన జీవ‌న విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మ‌న శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనే రెండు ర‌కాలు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం. కానీ ఈమ‌ధ్య‌కాలంలో మ‌న‌లో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌డం ఏ మంత మంచిది కాదు. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. గుండెపోటు, హార్ట్ ఎటాక్, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఇలా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఒక్కోసారి శరీరంలో అధికంగా ఉండే ఈ చెడు కొలెస్ట్రాల్ కార‌ణంగా మ‌నం ప్రాణాల‌ను కూడా కోల్పోవాల్సి వ‌స్తుంది.

క‌నుక ఈ స‌మ‌స్య నుండి మనం వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాలి. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డాలంటే మ‌న జీవ‌న విధానంతో పాటు మ‌న ఆహార‌పు అల‌వాట్ల‌ల్లో కూడా మార్పు చేసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించే ఆహారాల‌ను తీసుకోవాలి. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో మ‌న‌కు అవ‌కాడోలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిలో మోనో అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తో పాటు ఫైబ‌ర్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ సమ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఓట్స్ ను కూడా తీసుకోవాలి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. శ‌రీరంలో అధికంగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించ‌డంలో బార్లీ గింజ‌లు కూడా దోహ‌ద‌ప‌డ‌తాయి. వీటిలో ఉండే ఫైబ‌ర్ కొలెస్ట్రాల్ ను క‌రిగిస్తుంది.

Foods For LDL take these daily to get rid of bad cholesterol
Foods For LDL

అలాగే నిమ్మ‌జాతికి చెందిన పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. అలాగే కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు డార్క్ చాక్లెట్ ను ఎక్కువ‌గా తీసుకోవాలి. వీటిలో ఉండే ప్లేవ‌నాయిడ్స్ కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఇక కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంలో వెల్లుల్లి మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల లేదా నేరుగా దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా కొలెస్ట్రాల్ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చెడు కొలెస్ట్రాల్ స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts