Coconut Biscuits : కొబ్బ‌రి బిస్కెట్ల‌ను చేయ‌డం చాలా తేలిక.. ఎలాగంటే..?

Coconut Biscuits : మ‌న‌కు బేక‌రీల‌ల్లో ల‌భించే వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన బిస్కెట్ల‌ల్లో కొబ్బ‌రి బిస్కెట్లు కూడా ఒక‌టి. ఈ బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు. బేకరీల్ల‌లో ల‌భించే ఈ బిస్కెట్ల‌ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా వీటిని ఇంట్లో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు.ఒవెన్ లేక‌పోయినా కూడా ఈ బిస్కెట్ల‌ను ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చు. బేక‌రీలల్లో ల‌భించే ఈ కొబ్బ‌రి బిస్కెట్ల‌ను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బ‌రి బిస్కెట్ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పంచ‌దార – ముప్పావు క‌ప్పు, యాల‌కులు – 3, నెయ్యి – ముప్పావు క‌ప్పు, ఎండు కొబ్బ‌రి పొడి – ఒక క‌ప్పు, మైదాపిండి – ఒక క‌ప్పు, వంట‌సోడా – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు.

Coconut Biscuits recipe very sweet easy to make
Coconut Biscuits

కొబ్బ‌రి బిస్కెట్ల త‌యారీ విధానం..

ముందుగా జార్ లో పంచ‌దార‌, యాల‌కులు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యివేస్తూ బాగా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మం క్రీమ్ లాగా అయిన త‌రువాత ఎండుకొబ్బ‌రి పొడి వేసి క‌ల‌పాలి. తరువాత మైదాపిండిని, వంట‌సోడాను, ఉప్పును జ‌ల్లించి వేసుకోవాలి. త‌రువాత అంతా క‌లిసేలా చేత్తో బాగా క‌లుపుకోవాలి. అవ‌స‌ర‌మైతే కొద్దిగా నెయ్యి లేదా బ‌ట‌ర్ వేసి క‌లుపుకోవాలి. త‌రువాత పిండిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. పిండి నానిన త‌రువాత స్ట‌వ్ మీద వెడ‌ల్పుగా ఉండే గిన్నెను ఉంచి దానిపై మూత పెట్టి ఫ్రీహీట్ చేసుకోవాలి. త‌రువాత పిండిని స‌మానంగా ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఒక ప్లేట్ ను తీసుకుని దానికి నెయ్యి రాసుకోవాలి.

త‌రువాత ఒక్కో పిండి ముద్ద‌ను తీసుకుని బిస్కెట్ ఆకారంలో వ‌త్తుకోవాలి. త‌రువాత దీనిని ఎండు కొబ్బ‌రి పొడితో కోటింగ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని సిద్దం చేసుకున్న త‌రువాత ఈ ప్లేట్ ను ముందుగా సిద్దం చేసుకున్న గిన్నెలో ఉంచి పైన మూత‌ను ఉంచాలి. ఈ బిస్కెట్ల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై 15 నుండి 18 నిమిషాల పాటు బేక్ చేసుకుని స్ట‌వ్ ఆప్ చేసుకోవాలి. త‌రువాత వీటిని బ‌య‌ట‌కు తీసి చ‌ల్లార‌నివ్వాలి. బిస్కెట్లు పూర్తిగా చ‌ల్లారిన తరువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రి బిస్కెట్లు త‌యార‌వుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసిన బిస్కెట్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts