Foods For Muscles : ఈ ఫుడ్స్‌ను రోజూ తింటే చాలు.. బాహుబ‌లిని త‌ల‌ద‌న్నే లాంటి శ‌క్తి వ‌స్తుంది..!

Foods For Muscles : మ‌నం రోజూ 15 నుండి 16 గంట‌ల పాటు ప‌ని చేయాలంటే మ‌న శ‌రీరానికి బ‌లం, శ‌క్తి ఎంతో అవ‌స‌రం. త‌గినంత బ‌లం లేక‌పోతే నీర‌సం, బ‌ల‌హీన‌త మ‌న ద‌రి చేర‌తాయి. చాలా మంది శ‌రీరానికి బ‌లం చేకూర్చే అహారాలు అన‌గానే మాంసం, గుడ్లు అని మాత్ర‌మే భావిస్తారు. వాటినే ఆహారంగా తీసుకుంటారు. అయితే గుడ్లు,మాంసం కంటే బ‌ల‌మైన ఆహారాలు ఇంకా ఉంటాయని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో బ‌లం క‌లుగుతుంద‌ని మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్నిసొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మాంసం కంటే ఎక్కువ బ‌లం చేకూరుతుంద‌ని వీటి కంటే బ‌ల‌మైన ఆహారాలు ఇంకా ఉండ‌వ‌ని వారు తెలియ‌జేస్తున్నారు. అలాగే ఈ ఆహారాలు అంద‌రికి అందుబాటు ధ‌ర‌ల్లో ఉంటాయ‌ని వీటిని ఎవరైనా కొనుగోలు చేసి తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. శ‌రీరానికి చ‌క్క‌టి బ‌లాన్ని ఇచ్చే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శ‌రీరానికి బ‌లాన్ని ఇచ్చే వాటిల్లో వాల్ న‌ట్స్ కూడా ఒక‌టి. 100గ్రాముల వాల్ న‌ట్స్ లో 687 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. గుడ్డు, మాంసం, చికెన్ లో కంటే వాల్ న‌ట్స్ లో శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. శ‌రీరానికి బ‌లాన్ని ఇచ్చే అతి బ‌ల‌మైన ఆహారాల్లో వాల్ న‌ట్స్ మొద‌టి స్థానంలో ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. బాదంప‌ప్పులో కూడా శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. 100 గ్రాముల బాదంప‌ప్పులో 657 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వల్ల శ‌రీరానికి ఎంతో బ‌లం చేకూరుతుంది. జుట్టు ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. పుచ్చ‌గింజ‌ల ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌న శ‌రీరానికి బ‌లం ల‌భిస్తుంది. 100గ్రాముల పుచ్చ‌గింజ‌ల ప‌ప్పులో 627 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. మాంసం కంటే వీటిలో 6 రెట్లు బ‌లం ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే ఈ గింజ‌ల‌ల్లో ప్రోటీన్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది.

Foods For Muscles take daily for many benefits
Foods For Muscles

పుచ్చ‌గింజ‌ల ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం మొత్తం ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. పిస్తా ప‌ప్పు కూడా మ‌న‌కు ఎంతో బ‌లాన్ని ఇస్తుంది. 100గ్రాముల పిస్తా ప‌ప్పులో 627 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. అలాగే ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇక ఎంతో రుచిగా ఉండే జీడిప‌ప్పు కూడా మ‌న శ‌రీరానికి బ‌లాన్ని చేకూర్చుతుంది. 100గ్రాముల జీడిప‌ప్పులో 596 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం బ‌లంగా, ధృడంగా త‌యార‌వుతుంది. అలాగే గుమ్మ‌డి గింజ‌ల ప‌ప్పు కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. 100గ్రాముల గుమ్మ‌డి గింజ‌ల ప‌ప్పులో 590క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. ఈ ప‌ప్పును తీసుకోవ‌డం వల్ల శ‌రీరం బ‌లంగా త‌యార‌వ్వ‌డంతో పాటు జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

ఇక ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌న‌కు ఎంతో బ‌లం క‌లుగుతుంది. 100గ్రాముల ప‌ల్లీల‌ల్లో 567 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. మాంసం కంటే 5 రెట్లు ఎక్కువ బ‌లాన్ని ఈ గింజ‌లు ఇస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. పొద్దు తిరుగుడు గింజ‌ల ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌న శ‌రీర బ‌లంగా త‌యార‌వుతుంది. ఈ పప్పును తీసుకోవ‌డం వ‌ల్ల బ‌లంతో పాటు శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ ఇ ల‌భిస్తుంది. దీంతో మ‌నం య‌వ్వ‌నంగా క‌నిపించ‌డంతో పాటు శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. అలాగే ప‌చ్చికొబ్బ‌రిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌న శ‌రీరానికి బ‌లం క‌లుగుతుంది. ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ ఖ‌ర్చులో శ‌రీరానికి బ‌లం క‌లుగుతుంద‌ని అలాగే శ‌రీరానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts