చాలా మంది రాత్రి పూట అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తింటుంటారు. దీంతో అధికంగా బరువు పెరగడంతోపాటు గుండె జబ్బులు, డయాబెటిస్ వంటివి వస్తాయి. అయితే రాత్రి పూట కింద తెలిపిన ఆహారాలను తీసుకుంటే వాటితో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా నిద్ర లేమి సమస్య తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు బాదంపప్పులను తినాలి. వీటిలో ఉండే మెగ్నిషియం, మాంగనీస్‌లు నిద్రలేమి సమస్యను తగ్గిస్తాయి. ఒత్తిడి, డిప్రెషన్ మాయమవుతాయి. నిద్రలేమి సమస్య ఉన్నవారు బాదంపప్పును తింటే ప్రయోజనం ఉంటుంది.
కివీ పండ్లలో విటమిన్ సి, కె, ఫొలేట్, పొటాషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. జీర్ణ సమస్యలు ఉండవు. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
రాత్రి పూట చెర్రీ పండ్లను తినడం వల్ల శరీరానికి ముఖ్యమైన పోషకాలు అందుతాయి. నిద్రలేమితో బాధపడేవారు ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
రాత్రి పూట ఆహారంలో చేపలను తినడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య ఉండదు. శరీరంలో విటమిన్ డి స్థాయిలు పెరుగుతాయి.
వాల్ నట్స్‌ను రాత్రి పూట తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. రాత్రి పూట స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది.
రాత్రి పూట పాలు తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. శరీరానికి పోషకాలు అందుతాయి.