పేగుల్లో ఎవరికైనా సరే పురుగులు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. మట్టి, గోడకు వేసిన సున్నం, చాక్ పీస్‌లు, బలపాలు తినడం, బియ్యంలో మట్టిగడ్డలు తినడం వంటి కారణాల వల్ల పేగుల్లో పురుగులు ఏర్పడుతుంటాయి. మూతపెట్టని, సరిగ్గా నిల్వ చేయని ఆహార పదార్థాలను తినడం వల్ల, టాయిలెట్‌కు వెళ్లినప్పుడు శుభ్రతను పాటించకపోవడం వల్ల, అపరిశుభ్రంగా ఉన్న నీటిని తాగడం వల్ల, గోళ్లలో మట్టి పేరుకుపోయినా అలాగే వేళ్లతో తినడం వల్ల.. పేగుల్లో పురుగులు ఏర్పడుతాయి.
పేగుల్లో ఏర్పడే పురుగుల్లో అనేక రకాలు ఉంటాయి. నులిపురుగులు, కొంకిపురుగులు, కొరడా పురుగులు, బద్దె పురుగులు లేదా నట్టలు, ఏలికపాములు, దారపు పురుగులు, నీరుగడ్డ పురుగులు, మాంసపు పురుగులు, ఇతర పరాన్నజీవులు.. అనేక ఉంటాయి. వీటిల్లో ఏ పురుగులు అయినా సరే పేగుల్లో ఏర్పడవచ్చు.
* మలద్వారం వద్ద దురదగా ఉంటుంది.
* స్త్రీలలో వైట్ డిశ్చార్జి ఎక్కువగా అవుతుంది.
* మూత్ర నాళంలో మంటగా అనిపిస్తుంది. ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్తుంటారు.
* శరీరమంతటా కొన్ని సార్లు దద్దుర్లు, దురద వస్తాయి.
* పొడిదగ్గు ఉంటుంది. ఉబ్బసం, కడుపునొప్పి వస్తాయి.
* విరేచనాలు, నీరసం, రక్తహీనత, బరువు తగ్గడం కనిపిస్తాయి.
* కాలేయం పెరుగుతుంది.
* ఉల్లిపాయ రసాన్ని తీసి 3 నుంచి 5 చుక్కలను ఒక టీస్పూన్ నీళ్లకు కలిపి రోజుకు 2 నుంచి 3 సార్లు వాడుకోవాలి.
* వేపబెరడు చూర్ణాన్ని, వాయు విగండాల చూర్ణాన్ని ఒక గ్రాము మోతాదులో నీళ్లకు కలిపి తీసుకోవాలి.
* చిటికెడు ఇంగువను టీస్పూన్ పటికబెల్లం పొడితో కలిపి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.
* వాము పొడిని 2 గ్రాముల మోతాదులో తీసుకుని దాన్ని 1 గ్రాము ఉప్పుతో కలిపి వేడినీటితో తీసుకోవాలి.
* వేపాకుల రసం రెండు టీస్పూన్‌ల మోతాదుగా అంతే మొత్తంలో తేనెతో కలిపి తీసుకోవాలి.
* వాయు విగండాలను పొడి చేసి పావు టీస్పూన్ మోతాదులో తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాలి.
కృమిముద్గర రసం, కృమికుఠార రసం, విడంగారిష్టం, కుటజారిష్టం, కుటజఘనవటి వంటి ఔషధాలను వైద్యుల సలహాల మేరకు వాడుకోవాలి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365