కుంకుమ పువ్వు.. చూసేందుకు ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రపంచంలో చాలా మంది దీన్ని ఉపయోగిస్తుంటారు. పురాతన కాలం నుంచి దీన్ని వాడుతున్నారు. దీన్ని ముఖ్యంగా సౌందర్య సాధన ఉత్పత్తుల్లో వాడుతుంటారు.
కుంకుమ పువ్వును వంటల్లో వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి వస్తుంది. కుంకుమ పువ్వు సౌందర్య సాధనంగానే కాక ఔషధంగానూ ఉపయోగపడుతుంది. కాశ్మీర్ కుంకుమ పువ్వును చాలా మంది వాడుతుంటారు. కుంకుమ పువ్వుకు చెందిన దుంప, పువ్వు, కాండం, పైపొర, వేరు, ఆకులు అన్నీ అనేక రకాలుగా ఉపయోగపడతాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో కుంకుమ పువ్వు ఒక భాగంగా ఉంది.
కుంకుమ పువ్వును హైదరాబాదీ బిర్యానీలో వేస్తుంటారు. దీంతో బిర్యానీ చాలా రుచిగా కూడా ఉంటుంది. అలాగే పలు రకాల లస్సీల్లోనూ దీన్ని వేస్తుంటారు. దీని వల్ల లస్సీ రుచికరంగా ఉంటుంది. చక్కని రంగును కలిగి ఉంటుంది.
కుంకుమ పువ్వును ఆయుర్వేదంలో అనేక రకాలుగా ఉపయోగిస్తారు. అనేక వ్యాధులకు చికిత్స కోసం దీన్ని వాడుతారు. కుంకుమ పువ్వు మోకాళ్ల నొప్పులను తగ్గించగలదు. పురుషుల్లో శృంగార సామర్థ్యం పెంచుతుంది. ఆస్తమా, జలుబు, మొటిమలు, కడుపులో నొప్పి వంటి సమస్యలను తగ్గించగలదు.
* ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వువేసి రాత్రంతా నానబెట్టి ఉదయం తాగితే శరీరంలో ఉండే నీరు బయటకు పోతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు.
* కుంకుమ పువ్వు, తేనెను కలిపి తీసుకుంటే స్త్రీలలో వచ్చే గర్భాశయ సమస్యలు తగ్గుతాయి.
* రాత్రిపూట గోరు వెచ్చని పాలలో పటికబెల్లం, కుంకుమ పువ్వులను కొద్దిగా వేసి బాగా కలిపి తాగితే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. స్త్రీలలో సంతాన లోపం సమస్యలు పరిష్కారం అవుతాయి.
* కుంకుమ పువ్వును కలిపిన పాలను నిత్యం పిల్లలకు ఇస్తే మంచిది. వారు ఆరోగ్యంగా ఉంటారు.
* కుంకుమ పువ్వును వాడడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
* రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో 2 చిటికెల కుంకుమ పువ్వు, కొద్దిగా పటిక బెల్లం వేసి కలుపుకుని తాగితే గుండె జబ్బులు ఉన్నవారికి మేలు జరుగుతుంది.
* గర్భిణీలు నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో రెండు గులాబీ పువ్వుల రేకులు, చిటికెడు కుంకుమ పువ్వును కలుపుకుని తాగితే బిడ్డకు మేలు జరుగుతుంది.
* కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసెటిన్ అనబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నిజానికి కెరోటినాయడ్ పిగ్మెంట్లు. వీటి వల్లే కుంకుమ పువ్వు ఎరుపు రంగులో ఉంటుంది. ఇవి యాంటీ డిప్రెస్సెంట్ గుణాలను కలిగి ఉంటాయి. అంటే ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా మారుస్తాయి. మెదడు కణాలను రక్షిస్తాయి. తీవ్రమైన ఆకలి సమస్య, శరీరంలో వాపులు తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు.
* కుంకుమ పువ్వులో క్యాన్సర్ పై పోరాడే ఔషధ గుణాలు ఉంటాయి. కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్, స్కిన్, బోర్ మారో, ప్రోస్టేట్, లంగ్స్, బ్రెస్ట్, గర్భాశయం తదితర క్యాన్సర్ కణాలు నశిస్తాయి.