Garlic And Turmeric : రోజూ వీటిని ఇలా తీసుకుంటే చాలు.. ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఉండ‌వు.. హార్ట్ ఎటాక్ లు రావు..

Garlic And Turmeric : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌ను ఉప‌యోగించి మ‌నం న‌రాల్లో అడ్డంకుల‌ను, వేరీకోస్ వెయిన్స్, న‌రాల బ‌ల‌హీన‌త‌ను, గుండెల్లో నొప్పి వంటి వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది న‌రాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌డం, ఆర్ట‌రీస్ లో అడ్డంకులు ఏర్ప‌డ‌డానికి ముఖ్య కార‌ణం మ‌న శ‌రీరంలో ర‌క్తం చిక్క‌గా, మందంగా ఉండ‌డ‌మే. ర‌క్తం మందంగా ఉండ‌డం వ‌ల్ల ర‌క్తం స‌రిగ్గా ప్ర‌వ‌హించ‌క అడ్డంకులు ఏర్ప‌డుతూ ఉంటాయి. అలాగే మ‌న జవ‌న విధానం కూడా ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం. జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, వ్యాయ‌మం చేయ‌క‌పోవ‌డం, గంట‌లు గంట‌లు కూర్చొని ప‌ని చేయ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ర‌క్త‌నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి ర‌క్త స‌ర‌ఫ‌రాకు అడ్డంకిగా మార‌తుంది. ఇలా ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌డం వ‌ల్ల మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది.

అలాగే గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. క‌నుక ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. మ‌న ఇంట్లో ఉండే కేవ‌లం రెండు ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఈ స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ర‌క్త‌నాళాల్లో అడ్డంకుల‌ను తొల‌గించే ఈ రెండు ప‌దార్థాలు మ‌రేమిటో కాదు అవి ప‌సుపు మ‌రియు వెల్లుల్లి. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేయ‌డంలో వెల్లుల్లి మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ర‌క్తనాళాల్లో అడ్డంకులు తొల‌గిపోతాయి.

Garlic And Turmeric take them daily in this way for benefits Garlic And Turmeric take them daily in this way for benefits
Garlic And Turmeric

అధిక ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో మ‌లినాలు, విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. ఎముక‌లు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అలాగే ప‌సుపు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైర‌ల్, యాంటీ ఇన్ ప్లామేట‌రీ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచ‌డంలో, చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గడంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంలో ఇలా అనేక విధాలుగా ప‌సుపు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది.

అయితే ప‌సుపు మ‌రియు వెల్లుల్లిని ఎలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ర‌క్త‌నాళాల్లో అడ్డంకుల‌ను తొల‌గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం పొట్టు తీసిన రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 లేదా 3 గ్రాముల ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిని ప‌సుపు క‌లిపిన నీటిని తాగాలి. ఇలా రోజూ ఉద‌యం పర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా మ‌నం ర‌క్త‌నాళాల్లో అడ్డంకుల‌ను తొల‌గించుకోవ‌చ్చు. అలాగే మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవ‌చ్చు.

D

Recent Posts