Sugandha Sabja Sharbat : వేసవికాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది షర్బత్ ను తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. బయట లభించే రసాయనాలు కలిగిన శీతల పానీయాలను తాగడం కంటే ఇంట్లోనే షర్బత్ ను తయారు చేసుకుని తాగడం చాలా మంచిది. మనం మన రుచికి తగినట్టు రకరకాల షర్బత్ లను తయారు చేసుకుని తాగుతూ ఉంటాం. మనం సులభంగా చేసుకోదగిన వివిధ రకాల షర్బత్ లలో సుగంధ సబ్జా షర్బత్ కూడా ఒకటి. ఇది చాలా రుచిగా, కలర్ ఫుల్ గా ఉంటుంది. దీనిని కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీనిని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఎంతో రుచిగా చల్ల చల్లగా ఉండే ఈ సుగంధ సబ్జా షర్బత్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సుగంధ సబ్జా షర్బత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సుగంధ – 2 టేబుల్ స్పూన్స్, సోడా – ఒక గ్లాస్ , నిమ్మకాయ – 1, అర గంట పాటు నానబెట్టిన సబ్జా గింజలు – 2 టేబుల్ స్పూన్స్.
సుగంధ సబ్జా షర్బత్ తయారీ విధానం..
ముందుగా గ్లాస్ లో సుగంధ వేసుకోవాలి. తరువాత ఇందులో నిమ్మరసం వేసి కలపాలి. తరువాత సోడాను పోసి కలపాలి. చివరగా సబ్జా గింజలను వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సుగంధ సబ్జా షర్బత్ తయారవుతుంది. దీనిని చల్ల చల్లగా తాగితే చాలా రుచిగా ఉంటుంది. ఎండాకాలంలో ఈ విధంగా ఇంట్లోనే చక్కటి షర్బత్ ను తయారు చేసుకుని తాగవచ్చు. దీనిని తాగడం వల్ల మనం వేసవి తాపం నుండి బయటపడడంతో పాటు వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.