Ghee : నెయ్యి మంచిదే.. నెయ్యి అనగానే భయపడాల్సిన పనిలేదు..!

Ghee : నెయ్యి అనగానే చాలా మంది భయపడుతుంటారు. వద్దు.. వద్దు.. అని చాలా మంది అంటుంటారు. నెయ్యి తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని చాలా మంది భయపడుతుంటారు. కానీ నిజానికి అలా నెయ్యి గురించి భయపడాల్సిన పనిలేదు. నెయ్యి ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది.

ghee is good for our health take daily

పాలల్లో ప్రోటీన్‌ కాంపోనెంట్‌ కేసిన్‌ కారణంగా మిల్క్‌ ఎలర్జీలు వస్తాయనే అభిప్రాయం ఉంది. నిజానికి నెయ్యిని తయారు చేసేటప్పుడు పాలల్లో ఉండే లాక్టోస్‌, కేసిన్‌లు పైకి తేలతాయి. ఇలా నెయ్యిపై తేలిన వాటిని తీసేస్తారు. అందువల్ల అలర్జీలు రావు. కనుక నెయ్యిని నిర్భయంగా తీసుకోవచ్చు.

కొవ్వును కరిగించే విటమిన్లు నెయ్యిలో ఉన్నాయి. వాటిల్లో విటమిన్‌ ఎ, ఇ, కెలు ఉన్నాయి. ఇవి కంటి చూపును మెరుగు పరచడమే కాక చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

నెయ్యిని తీసుకోవడం వల్ల పెద్ద పేగులు శుభ్రమై ఆరోగ్యంగా ఉంటాయి. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా గ్రహిస్తుంది. దీంతో షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంటాయి.

నెయ్యిని తీసుకోడం వల్ల శరీరంలో కరగకుండా మొండి ఉండే కొవ్వు కరుగుతుంది. నెయ్యిలో విటమిన్‌ కె2 అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు కావల్సిన కాల్షియంను అందించి ఎముకలను బలంగా ఉంచుతుంది.

మెదడు యాక్టివ్‌గా పని చేసేందుకు ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. అవి నెయ్యిలో ఉంటాయి. దీంతో మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఇలా నెయ్యి వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అందువల్ల రోజూ నెయ్యిని తీసుకోవచ్చు. కనీసం 2 టీస్పూన్ల మోతాదులో నెయ్యిని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.

Admin

Recent Posts