Ghee On Empty Stomach : భారతీయులు ఎక్కువగా తినే ఆహార పదార్థాలల్లో నెయ్యి కూడా ఒకటి. నెయ్యిని ఎంతో కాలంగా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము. నెయ్యితో అనేక రకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ నెయ్యిని తీసుకోవడానికి ఇష్టపడతారు. నెయ్యిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా వంటల్లో వాడడం లేదా అన్నంతో కలిపి తీసుకోవడానికి బదులుగా రోజూ ఉదయం పరగడుపున ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. పరగడుపున నెయ్యిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో… ఇప్పుడు తెలుసుకుందాం. పరగడుపున నెయ్యిని తీసుకోవడం వల్ల కడుపులో ఎంజైమ్ లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఆహారంలో ఉండే పోషకాలను కూడా ప్రేగులు చక్కగా గ్రహిస్తాయి.
జీర్ణ సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. అలాగే నెయ్యిలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. దీంతో శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. నెయ్యిని పరగడుపున తీసుకోవడం వల్ల మనం రోజంతా అలిసిపోకుండా, ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. నెయ్యిలో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీంతో నెయ్యిని తీసుకోవడం వల్ల మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా మనం ఇతర చిరుతిళ్ల జోలికి పోకుండా ఉంటాము. ఆహారాన్ని కూడా తక్కువగా తీసుకుంటాము. దీంతో మన శరీర బరువు అదుపులో ఉంటుంది. నెయ్యిలో ఉండే కొవ్వులు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నెయ్యిని తీసుకోవడం వల్ల మెదడు కణాల అభివృద్ది, నిర్వహణ సరిగ్గా ఉంటుంది. అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. అలాగే పరగడుపున నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు, వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రోజూ నెయ్యిని పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. దీంతో శరీర ఆరోగ్యం, శ్రేయస్సు మెరుగుపడుతుంది.
నెయ్యిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయిలు అదుపులో ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఇ, కె వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. నెయ్యిని తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన, అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజూ నెయ్యిని తీసుకోవడం వల్ల క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అయ్యి త్వరగా బరువు తగ్గుతారు. పరగడుపున నెయ్యిని తీసుకోవడం వల్ల ప్రేగులల్లో కదలికలు చక్కగా ఉంటాయి. దీంతో మలబద్దకం సమస్య తగ్గుతుంది. పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరంలో వాపు, నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కీళ్ల ఆరోగ్యానికి నెయ్యి ఎంతో తోడ్పడుతుంది. ఈ విధంగా నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని పరగడుపున తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.