Ginger And Garlic Paste : మారిన మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్లు మనల్ని అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడేస్తున్నాయన్న సంగతి మనకు తెలిసిందే. మానసిక, శారీరక పరమైన సమస్యలతో నిత్యం ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటారు. మన వంటింట్లో ఉండే ఔషధాలను వదిలేసి అనేక రకాల మందులను వాడుతూ ఉంటారు. మందులను వాడడం వల్ల సమస్య నుండి ఉపశమనం కలిగినప్పటికి అనేక దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుంది. కానీ మన వంటింట్లో ఉండే ఔషధాలను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మనం అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. మన వంటింట్లో ఉండే ఔషధాల్లో అల్లం, వెల్లుల్లి ఒకటి. వీటిని విడివిడిగా వాడడంతో పాటు కలిపి పేస్ట్ గా చేసి వంటల్లో వాడుతూ ఉంటాం.
అల్లం, వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ఎలా తీసుకున్నా కూడా మనం వివిధ రకాల అనారోగ్య సమస్యలను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. దగ్గు, జలుబులతో పాటు ఇతర శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో అల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ గా చేసి వాడడం వల్ల వాత, పిత, కఫ సమస్యలు తగ్గుతాయి. అలాగే కీళ్ల వాతం, మోకాళ్ల వాతం వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ ఉదయం అల్పాహారం చేసిన తరువాత కుంకుడు కాయంత పరిమాణంలో అల్లం వెల్లుల్లి ముద్దను తీసుకోవడం వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
అల్లం వెల్లుల్లిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాల నొప్పులు తగ్గడంతో పాటు కండరాలు ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయి. అంతేకాకుండా అల్లం వెల్లుల్లి కలిపి తీసుకోవడం వల్ల మానసికపరమైన సమస్యలు తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే అల్లం వెల్లుల్లిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు అల్లం వెల్లుల్లిని కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
ముఖ్యంగా పక్షవాతానికి గురి అయిన వారు అల్లం వెల్లుల్లిని తీసుకోవడం వల్ల తిరిగి సాధారణ స్థితికి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ను మనం నిత్యం వంటల్లో వాడుతూ ఉంటాం. వంటల్లో వాడడంతో పాటు వీటిని సమాన భాగాల్లో తీసుకుని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను కుంకుడు కాయంత పరిమాణంలో రోజూ అల్పాహారం చేసిన తరువాత తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.