Ginger For Diabetes : మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలల్లో డయాబెటిస్ కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. రోజు రోజుకి షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య పెరుగుతుందని గణంకాలు కూడా చెబుతున్నాయి. మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. షుగర్ కారణంగా మనం ఇతర అనేక రకాలు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కొందరిలో మందులు వాడినప్పటికి ఈ డయాబెటిస్ అదుపులో లేకుండా పోతుంది.
ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు అల్లాన్ని వాడడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారిపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారికి రోజూ 4 గ్రాముల అల్లాన్ని ఇచ్చి చూడడం వల్ల వారిలో ఫాస్టింగ్ షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని వారు వెల్లడించారు. అలాగే అల్లాన్ని వాడడం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుందని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. అల్లాన్ని మనం ఎంతో కాలంగా వంటల్లో ఉపయోగిస్తున్నాము. అలాగే అనేక ఔషధ తయారీలలో కూడా అల్లాన్ని విరివిరిగా ఉపయోగిస్తున్నారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అల్లాన్ని వాడడం వల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడంతో పాటు మనం అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
నోటి ఆరోగ్యాన్ని మెరుగుపచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గించడంలో, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా చేయడంలో ఇలా అనేక రకాలుగా అల్లం మనకు సహాయపడుతుంది. అయితే మనం ఎక్కువగా అల్లాన్ని పేస్ట్ గా చేసి వంటల్లో వాడుతూ ఉంటాము. ఇలా వాడడం వల్ల మనకు అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక అల్లాన్ని నేరుగా తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. అలాగే అల్లాన్ని దంచి దాని నుండి రసాన్ని తీసుకుని తాగవచ్చు. ఈవిధంగా టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు రోజూ అల్లాన్ని 4 గ్రాముల మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.