Hair Care : జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా ఉండాలన్ని మనం ఎన్నో రకాల నూనెలను వాడుతూ ఉంటాము. దాదాపు మార్కెట్ లో లభించే అన్ని రకాల నూనెలను వాడుతూ ఉంటాము. అయినప్పటికి చాలా మంది జుట్టు రాలడం, జుట్టు పొడిబారడం, జుట్టు చిట్లడం వంటి వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలా జుట్టు సమస్యలతో బాధపడే వారు ఉల్లిపాయ నూనెను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ నూనెను వాడడం వల్ల జుట్టు సమస్యలన్నీ తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా తయారవుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఈ నూనెను వాడడం వల్ల మన జట్టుకు ముఖ్యంగా 7 లాభాలు కలుగుతాయని వారు చెబుతున్నారు. ఉల్లిపాయ నూనెను వాడడం వల్ల మన జుట్టుకు కలిగే మేలు ఏమిటి.. నిపుణులు ఎందుకు ఈ నూనెను వాడమని చెబుతున్నారో… ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ నూనెలో క్యాంపరాల్, క్వెర్సిటిన్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. వీటి వల్ల రక్తనాళాలు వ్యాకోచించి జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. రక్తప్రసరణ ఎక్కువగా జరగడం వల్ల జుట్టు కుదుళ్లకు పోషకాలు ఎక్కువగా అందుతాయి. దీంతో జుట్టు ధృడంగా పెరుగుతుంది. అలాగే ఉల్లిపాయ నూనెలో కెటలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జుట్టుకు నలుపు వర్ణాన్ని ఇచ్చే మెలనోసైట్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో జుట్టు తెల్లబడకుండా నలుపు రంగులో ఉంటుంది. అలాగే ఉల్లిపాయలో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు కుదుళ్లను ధృడంగా చేయడంలో సహాయపడతాయి. ఉల్లిపాయ నూనెను జుట్టు కుదుళ్లల్లోకి ఇంకేలా బాగా పట్టించడం వల్ల జుట్టు కుదుళ్లు ధృడంగా మారడంతో పాటు జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి. అలాగే ఈ నూనెను తలకు పట్టించడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. ఉల్లిపాయ నూనెలో యాంటీ ఇన్ ప్లామేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
ఇవి తలలో దురద, చుండ్రు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఈ ఉల్లిపాయ నూనెను కొబ్బరి నూనె కలిపి రాసుకోవడం వల్ల జుట్టు కండీష్ నర్ గా కూడా పని చేస్తుంది. ఈ నూనెను రాసుకోవడం వల్ల షాంపుల వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి. ఉల్లిపాయ నూనెలో ఫెసిటిన్, అలిసిన్ వంటి రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లల్లో ఉండే ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో, తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా చక్కగా సహాయపడతాయి. దీంతో జుట్టు ఊడిన స్థానంలో మరలా కొత్త వెంట్రుకలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఉల్లిపాయ నూనె మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుందని దీనిని వాడడం వల్ల మనం అనేక రకాల జుట్టు సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.