ఆముదంతో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు..!

ఆముదం నూనెను భారతీయులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో దీనికి ప్రాముఖ్యత ఉంది. ఆముదం చెట్టు విత్తనాల నుంచి నూనెను తీస్తారు. దాన్ని ఆముదం అని పిలుస్తారు. ఆముదం అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని పలు మందులు, చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో వాడుతారు. ఈజిప్టులో పురాతన కాలంలో ఆముదాన్ని దీపాల్లో ఇంధనంగా ఉపయోగించేవారు. ఆముదం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను ఆముదంతో నయం చేసుకోవచ్చు.

health benefits of castor oil

1. మలబద్దకం సమస్య ఉన్నవారికి ఆముదం అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి నిద్రించే ముందు దీన్ని అర టీస్పూన్‌ మోతాదులో తీసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే సుఖంగా విరేచనం అవుతుంది. ఆముదం జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. పేగులు, జీర్ణాశయంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.

2. ఆముదంలో రికోనోలిక్‌ యాసిడ్‌, మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచేందుకు సహాయ పడతాయి. చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. చర్మ సమస్యలు ఉన్నవారు తరచూ ఆముదంను రాసుకుంటే ఫలితం ఉంటుంది. శరీరానికి ఆముదాన్ని బాగా మర్దనా చేసి స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. చర్మ సమస్యలు ఉండవు.

3. గాయాలు, పుండ్లపై ఆముదం రాయడం వల్ల అవి త్వరగా మానుతాయి. ఆముదంలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల గాయాలు, పుండ్లు మానుతాయి. వాటిపై ఆముదాన్ని లేపనంగా రాయాలి. అవసరం అయితే కట్టు కట్టవచ్చు. దీంతో త్వరగా మానుతాయి.

4. ఆముదంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ఆముదంతో నొప్పి ఉన్న ప్రదేశంలో మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ నూనెను తరచూ వాడితే ప్రయోజనం ఉంటుంది.

5. మొటిమలను తగ్గించండలో ఆముదం బాగా పనిచేస్తుంది. మొటిమలపై తరచూ ఆముదాన్ని రాస్తుంటే ప్రయోజనం ఉంటుంది. ఆముదంలో ఉండే యాంటీ మైక్రోబియల్‌ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

6. ఆముదంలో యాంటీ ఫంగల్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల దీంతో దంతాలను తోముకుంటే దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు. దంతాలు దృఢంగా మారుతాయి. చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గుతుంది. నోట్లో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.

7. ఆముదం సహజసిద్ధమైన హెయిర్‌ కండిషనర్‌గా పనిచేస్తుంది. ఇది దెబ్బ తిన్న జుట్టును రక్షిస్తుంది. తరచూ ఆముదాన్ని శిరోజాలకు రాయడం వల్ల శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. చుండ్రు తగ్గుతుంది. వెంట్రుకలు మృదువుగా, ప్రకాశవంతంగా మారుతాయి.

సూచన – ఆముదం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ కొందరికి ఆముదం పడదు. అలర్జీలు వస్తాయి. అలాంటి వారు ఆముదాన్ని వాడకపోవడమే మంచిది. లేదా డాక్టర్‌ సూచనతో వాడుకోవాల్సి ఉంటుంది.

Admin

Recent Posts