గర్భిణీలు లవంగాలను తినడం వల్ల కలిగే 7 ఆరోగ్యకర ప్రయోజనాలు..!

మాంసం లేదా ప్ర‌త్యేక‌మైన వెజ్ వంట‌కాల‌ను చేసేట‌ప్పుడు స‌హజంగానే ఎవ‌రైనా స‌రే మ‌సాలాల‌ను ఉప‌యోగిస్తుంటారు. వాటి వ‌ల్ల వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. మ‌సాలాల్లో ల‌వంగాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి ఘాటైన రుచిని క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల కూర‌ల్లో ఘాటుద‌నం కోరుకునేవారు ఎక్కువ‌గా ల‌వంగాల‌ను ఉప‌యోగిస్తుంటారు. అయితే ఇవి గ‌ర్భిణీల‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

1. ఒక టీస్పూన్ ల‌వంగాల్లో రోజువారీగా మ‌న‌కు అవ‌సరం అయ్యే మాంగ‌నీస్‌లో 30 శాతం ల‌భిస్తుంది. అలాగే విట‌మిన్ కె 4 వాతం, విట‌మిన్ సి 3 శాతం ల‌భిస్తాయి. దీని వ‌ల్ల పోష‌కాలు అందుతాయి.

2. లవంగాల‌లో యాంటీ ఆక్సిడెంట్స్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గ‌ర్భిణీల‌కు ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.

3. గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో స‌హ‌జంగానే స్త్రీల‌లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. ఇందుకు ల‌వంగాలు బాగా ప‌నిచేస్తాయి. అలాగే జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అయితే క‌డుపు నొప్పి, విరేచ‌నాలు అవుతున్న స‌మ‌యంలో మాత్రం ల‌వంగాల‌ను తిన‌రాదు. ఆ స‌మ‌స్య‌లు త‌గ్గాకే ల‌వంగాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

4. గ‌ర్భిణీల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య స‌హ‌జంగానే క‌నిపిస్తుంటుంది. ఇందుకు గాను ల‌వంగాలు దోహదం చేస్తాయి. ల‌వంగాల్లో ఉండే ఐర‌న్ గ‌ర్భిణీల్లో ర‌క్త హీన‌త స‌మ‌స్య రాకుండా చూస్తుంది. అలాగే శిశువు స‌రైన బ‌రువుతో పుట్టేందుకు అవ‌కాశం ఉంటుంది.

5. ల‌వంగాల్లో ఉండే విట‌మిన్ ఇ గ‌ర్భిణీలు, వారి క‌డుపులో పెరిగే శిశువుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వారికి చ‌ర్మ స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది.

6. ల‌వంగాల్లో కాల్షియం, ఫాస్ఫ‌ర‌స్ వంటి మిన‌ర‌ల్స్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి త‌ల్లి, శిశువు ఇద్దరిలోనూ ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తాయి.

7. ల‌వంగాల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పిండం మెద‌డు ఎదుగుద‌ల‌కు స‌హాయ ప‌డ‌తాయి.

ల‌వంగాల‌ను గ‌ర్భిణీలు తిన‌వ‌చ్చు. సురక్షిత‌మే. అయిన‌ప్ప‌టికీ ఒక్క‌సారి వైద్యుల‌ను సంప్ర‌దించి వీటిని నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పైన తెలిపిన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts