ఎండు ద్రాక్ష, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

వేసవి కాలం ప్రారంభం కావడంతో ఎక్కువ మంది మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి వివిధ రకాల ఆహారపదార్థాలను, పండ్లు, పానీయాలను మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడతారు. ఈ విధంగా మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి పెరుగు, ఎండు ద్రాక్షలను కలిపి తయారు చేసుకున్న రెసిపీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాకుండా, శారీరక బలహీనతను కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా పురుషులలో ఈ రెసిపి ఎంతో ప్రయోజనకరం. ఈ రెండింటిని కలిపి తినడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

health benefits of raisins and curd mixture

పెరుగు, ఎండుద్రాక్ష ప్రయోజనాలు

వాస్తవానికి పెరుగు, ఎండుద్రాక్షలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ బి 2, విటమిన్ బి 12, పైరిడాక్సిన్, కెరోటినాయిడ్స్ వంటివి ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎండు ద్రాక్షలో అధికభాగం ఇనుము, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ఉం టాయి. ఇవి మన శరీరానికి వ్యాపించే అనేక రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

పెరుగు, ఎండు ద్రాక్ష మిశ్రమం ఇలా చేయాలి

ముందుగా ఒక గిన్నెలో అధిక శాతం కొవ్వు కలిగిన పాలను వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్న పాలలో ఎండు ద్రాక్షను వేసి అందులో కొద్ది పరిమాణంలో పెరుగును కలపాలి. ఈ గిన్నెను దాదాపుగా ఆరు గంటల పాటు పక్కన పెట్టాలి. ఆరు గంటల తర్వాత ఈ పాలు మొత్తం పెరుగుగా మారి గట్టిపడుతుంది. ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకున్న మిశ్రమాన్ని తినడం వల్ల వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చు.

పురుషులకు ఎందుకు ప్రయోజనకరం ?

ఒక పరిశోధనలో భాగంగా ఈ ఎండుద్రాక్ష, పెరుగు రెసిపిని పురుషులు అధికంగా తీసుకోవడం వల్ల వారిలో వీర్యకణాల నాణ్యత మెరుగుపడటానికి ఈ మిశ్రమం దోహదపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అదేవిధంగా పెరుగు ఎన్నో రకాల వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. పురుషులలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ను పెంచే ఆహార పదార్థంగా ఎండు ద్రాక్షను పరిగణించారు. ఇది పురుషులలో కలిగే లైంగిక సమస్యలను అధిగమించడానికి దోహదపడుతుంది.

ఈ మిశ్రమం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

* ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు, ఎండుద్రాక్ష మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఉపయోగపడే మంచి బాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.

* ఈ మిశ్రమం శరీర ఎముకలను బలోపేతం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

* శరీరంలో కీళ్ళవాపు సమస్యలతో బాధపడేవారు పెరుగు, ఎండు ద్రాక్ష కలిపిన మిశ్రమాన్ని రోజూ తినడం వల్ల వాపు సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా రక్తపోటు సమస్యతో బాధపడేవారికి ఈ మిశ్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Sailaja N

Recent Posts