గత కొద్ది రోజుల క్రితం ఎటువంటి సాంకేతిక అభివృద్ధి చెందనప్పుడు ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్లు ఉండేవి కాదు. కనుక ఆహారపదార్థాలను బయటనే పులియబెడుతూ సంరక్షించుకునే వారు. ఈ ప్రక్రియలో ఎంతో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు ఆహార పదార్థాలను ఆల్కహాల్ గా మార్చేవి. ఈ విధమైన ప్రక్రియ జరిగినప్పుడు ఆహారపదార్థాలు పులుపు రుచిని కలిగి ఉండడంతోపాటు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించేవి. అందుకోసమే డాక్టర్లు ప్రతి రోజు తప్పకుండా పులియబెట్టిన ఆహారపదార్థాలను తీసుకోవాలని సూచిస్తారు. అసలు పులియబెట్టిన ఆహారపదార్థాలను తీసుకోవటం వల్ల ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పులియబెట్టిన ఆహారపదార్థాలలో ఉండే ప్రోబయోటిక్స్ బాక్టీరియాలు మన శరీరంలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. ఫలితంగా మనం తీసుకున్న ఆహారంలో ఉండే పోషకాలు రక్త ప్రవాహంలోకి సమర్థవంతంగా కలిసిపోయి మన పేగులలో పీహెచ్ స్థాయిలను నియంత్రించడానికి సహకరిస్తాయి.
2. ప్రతి రోజూ పులియబెట్టిన ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఉబ్బసం, డయాబెటిస్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ద్వారా కలిగే మంటను తగ్గించుకోవచ్చు.
3. పులియబెట్టిన ఆహారపదార్థాలలో ఎక్కువగా మన శరీరానికి ఉపయోగపడే బాక్టీరియా ఉంటుంది. ఈ బాక్టీరియా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు సహాయం చేస్తుంది. దీని వల్ల అధిక బరువు తగ్గుతారు.
4. పులియబెట్టిన ఆహారపదార్థాలు జీర్ణక్రియలకు సహాయ పడతాయి. వాటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ మన శరీరానికి పోషణను, శక్తిని అందిస్తాయి.
5. పులియబెట్టిన ఆహార పదార్థాలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ బి12 ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. ఈ పదార్థాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసేందుకు సహాయ పడతాయి.
6. పులియబెట్టిన ఆహారాల్లో లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసే ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి అధిక బరువు తగ్గడానికి దోహదపడతాయి.
పెరుగు, పన్నీర్, ఇడ్లీ, దోశ వంటివి పులియబెట్టిన ఆహారాల కిందకు వస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365