కోడి మాంసం లాగే చాలా మంది కౌజు పిట్టల మాంసాన్ని ఇష్టంగా తింటారు. ఇక కోడిగుడ్లలాగే వీటి గుడ్లను కూడా తినవచ్చు. ఈ గుడ్లలోనూ ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కోడిగుడ్ల కన్నా కొంచెం ఎక్కువగా ఈ గుడ్లలో పోషకాలు ఉంటాయి. అందువల్ల కౌజు పిట్టల గుడ్లను తరచూ తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
1. కౌజు పిట్టల గుడ్లలో అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలో యాంటీ బాడీలు అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో వైరస్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
2. కౌజు పిట్టల గుడ్లలో ఉండే ప్రోటీన్లు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. నాడీ మండల వ్యవస్థ పనితనాన్ని పెంచుతాయి. దీని వల్ల మెదడు కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి.
3. కౌజు పిట్టల గుడ్లలో డీహెచ్ఏ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అందువల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
4. ఈ పిట్టల గుడ్లలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి.
5. కౌజు పిట్టల గుడ్లలో లుసిన్ అనబడే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీని వల్ల ఇన్సులిన్ ను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. ఈ క్రమంలో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ విషయాన్ని సైంటిస్టులు తమ అధ్యయనాల ద్వారా వెల్లడించారు.
6. కౌజు పిట్టల గుడ్లలో బి విటమిన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. శరీరానికి శక్తి అందుతుంది. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
7. చిన్నారులకు ఈ గుడ్లను తినిపించడం వల్ల వారిలో పెరుగుదల, శరీర నిర్మాణం సరిగ్గా ఉంటుంది. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి.
8. ఈ పిట్టల గుడ్లను తినడం వల్ల శరీరంలోని భార లోహాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. రక్తం శుద్ధి అవుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365