బ‌రువు త‌గ్గాల‌ని డైట్ పాటించేవారు బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీల‌ను తిన‌వ‌చ్చా ?

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూసేవారు చాలా మంది డైట్ పాటిస్తుంటారు. ఏ ప‌దార్థాన్ని తినాల‌న్నా ఆచి తూచి అడుగు వేస్తూ.. ఆలోచించి మ‌రీ తింటారు. అయితే ద‌క్షిణ భార‌త దేశంలో చాలా మంది ఉదయం త‌ర‌చూ ఇడ్లీల‌ను తింటుంటారు. చ‌ట్నీ, సాంబార్ వంటి ప‌దార్థాల‌తో ఇడ్లీల‌ను లాగించేస్తుంటారు. అయితే బరువు త‌గ్గాల‌ని చూసేవారు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఇడ్లీల‌ను తిన‌వ‌చ్చా ? బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఇడ్లీల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చా ? అంటే.. అందుకు న్యూట్రిష‌నిస్టులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో చూడండి.

can weight loss dieters eat idly for breakfast

ఆరూషి లైఫ్ స్టైల్ వ్య‌వ‌స్థాప‌కురాలు, న్యూట్రిష‌నిస్టు అరూషి అగ‌ర్వాల్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఇడ్లీలు ఆరోగ్య‌వంత‌మైన బ్రేక్‌ఫాస్ట్ ల జాబితా కింద‌కు వ‌స్తాయి. వాటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవ‌న్నీ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మే. అందువ‌ల్ల ఇడ్లీల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇడ్లీల‌ను పులియ‌బెట్టిన పిండితో త‌యారు చేస్తారు. అందువ‌ల్ల అవి చాలా ఆరోగ్య‌వంత‌మైన‌వి. త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. అందువ‌ల్ల అధిక బ‌రువు డైట్ పాటించేవారు ఇడ్లీల‌ను భేషుగ్గా తిన‌వ‌చ్చు. బ‌రువు పెరుగుతామ‌ని భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు.

ఇడ్లీల‌ను చాలా మంది భార‌తీయులు తింటారు. వీటిని ఆవిరిపై త‌యారు చేస్తారు. అందువ‌ల్ల ఆరోగ్య‌వంత‌మైన ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. ఒక్క ఇడ్లీలో కేవ‌లం 33 క్యాల‌రీలు మాత్ర‌మే ఉంటాయి. ఈ క్ర‌మంలో ఇడ్లీల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు కావ‌ల్సిన శ‌క్తి కూడా ల‌భిస్తుంది. అలాగే ప్రోటీన్లు, ఫైబ‌ర్ ల‌భిస్తాయి. ఇవి ఆక‌లిని నియంత్రిస్తాయి. దీంతో త‌క్కువ ఆహారం తీసుకుంటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది. కాబ‌ట్టి అధిక బ‌రువు డైట్ పాటించే వారు నిరభ్యంత‌రంగా ఇడ్లీల‌ను తీసుకోవ‌చ్చు. బ‌రువు పెరుగుతామేమోన‌ని భ‌యం చెందాల్సిన ప‌నిలేదు.

ఇక ఇడ్లీల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది. శ‌రీరానికి శ‌క్తి అందుతుంది. ఇడ్లీల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ శ‌రీర పీహెచ్ స్థాయిల‌ను నియంత్రిస్తుంది. దీని వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది.

అయితే ఇడ్లీలు ఆరోగ్య‌క‌ర‌మే అయినా వాటిని త‌క్కువగానే తినాలి. అవే కాదు, ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆహారాన్ని అయినా త‌క్కువ‌గానే తీసుకోవాలి. లేదా మోతాదులో తీసుకోవ‌చ్చు. అధికంగా తీసుకుంటే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌క‌పోగా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక తినే ఆహారంపై ఓ క‌న్నేసి ఉంచాలి. త‌క్కువ మోతాదులో, శ‌రీరానికి అవ‌స‌రం అయినంత మేర తింటే చాలు. ఇడ్లీల‌ను ఎవ‌రైనా తిన‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌న‌కునేవారు కూడా త‌క్కువ మోతాదులో తీసుకోవ‌చ్చు. వాటిని మానేయాల్సిన ప‌నిలేదు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts