గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌వారు నిమ్మ‌ర‌సం తాగ‌వ‌చ్చా ?

నిమ్మ‌ర‌సాన్ని రోజూ తాగడం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. నిమ్మ‌ర‌సం, తేనె రెండింటి కాంబినేష‌న్ మ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది. అయితే నిమ్మ‌ర‌సం ఆమ్ల స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది క‌దా, క‌నుక గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌వారు నిమ్మ‌ర‌సం తాగ‌కూడ‌దు.. అని చెప్పి కొంద‌రు నిమ్మ‌రసాన్ని తీసుకునేందుకు అయిష్ట‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. నిజానికి వారిది అపోహే. ఎందుకంటే..

Can people with gas problems drink lemon juice

నిమ్మ‌ర‌సం ఆమ్ల స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది. క‌రెక్టే. అయితే నిమ్మ‌ర‌సాన్ని తీసుకున్న‌ప్పుడు అది మ‌న నోట్లోని లాలాజ‌లంతో క‌లిశాక సుమారుగా 1 గంట స‌మ‌యం అనంత‌రం అది క్షార స్వ‌భావాన్ని పొందుతుంది. దీంతో జీర్ణాశ‌యంలో క్షార వాతావ‌ర‌ణాన్ని (ఆల్క‌లైన్‌) ఏర్పాటు చేస్తుంది. దీని వ‌ల్ల గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అంతేకానీ.. నిమ్మ‌ర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్ పెర‌గ‌దు.

నిమ్మ‌ర‌సం యాసిడ్ స్వ‌భావాన్ని క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ అది మ‌న శరీరంలో ఆల్కలైన్‌గా మారుతుంది. అందువ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూడా నిమ్మ‌ర‌సాన్ని తీసుకోవ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ ప‌దార్థాన్ని అయినా స‌రే మితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మ‌ర‌సం క‌లిపి తాగ‌వ‌చ్చు. దాంతోపాటు అవ‌స‌రం అనుకుంటే తేనె, అల్లం ర‌సం వంటివి కూడా క‌లుపుకోవ‌చ్చు. దీని వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరిగి కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts