Healthy Snacks For Weight Loss : చలికాలంలో చాలా మందికి హాయిగా దుప్పటి కప్పుకుని నిద్రపోవాలనిపిస్తుంది. అలాగే మనకు నచ్చిన ఆహారాన్ని, రుచికరమైన ఆహారాన్ని తీసుకోవాలని కోరిక కలుగుతుంది. చలికాలంలో ఇలాంటి కోరికలు కలగడం సహజం. ఇలా రుచికరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆరోగ్యానికి మేలు చేసే అలాగే బరువును అదుపులో ఉంచే స్నాక్స్ చాలా ఉన్నాయి. చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల రుచికరమైన ఆహారాన్ని తీసుకోవాలనే మన కోరిక తీరడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. చలికాలంలో మన బరువును అదుపులో ఉంచే రుచికరమైన స్నాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బరువును అదుపులో ఉంచే చిరుతిళ్లల్లో మసాలా పుట్నాల పప్పు కూడా ఒకటి. వీటిలో ప్రోటీన్,ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
వీటిని తీసుకోవడం వల్ల రుచితో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది. వీటిలో జీలకర్ర పొడి, చాట్ మసాలా, పచ్చిమిర్చి వంటి వాటిని వేసుకుని మరింత రుచిగాతయారు చేసి స్నాక్స్ గా తీసుకోవచ్చు. అలాగే మొలకెత్తిన గింజలతో సలాడ్ ను చేసి తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొలకెత్తిన గింజలల్లో చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వంటి వాటిని వేసి సలాడ్ గా చేసుకుని తీసుకోవచ్చు. అలాగే ఓట్స్ తో పోహను కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, పచ్చిబఠాణీ, ఆవాలు వంటి వాటితో ఓట్స్ ను ఉడికించి పోహ లాగా చేసి తీసుకోవచ్చు.
ఇలా వేడి వేడిగా తీసుకోవడం వల్ల చలికాలంలో రుచికరమైన ఆహారాన్ని తీసుకోవాలనే మన కోరిక కూడా తీరుతుంది. అదే విధంగా ఫ్రూట్ చాట్ ను తీసుకోవడం కూడా చాలా మంచిది. పండ్లల్లో చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. శరీరానికి కావల్సిన పోషకాలు కూడా అందుతాయి. ఇక చలికాలంలో రుచిగా పనీర్ టిక్కాను తయారు చేసి తీసుకోవచ్చు. పనీర్ లో ప్రోటీన్, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. పనీర్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఇతర మసాలా దినుసులు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత దీనిని గ్రిల్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఆరోగ్యకరమైన, రుచికరమైన చిరుతిండి తయారవుతుంది. అలాగే చలికాలంలో బేసన్ డోక్లా ను తీసుకోవడం వల్ల కూడా మనం బరువు పెరగకుండా ఉంటాము. శనగపిండి, పెరుగు, ఇతర మసాలా దినుసులు వేసి ఆవిరి మీద చేసే ఈ డోక్లా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అదే విధంగా చలికాలంలో కాల్చిన మఖానాను కూడా మనం ఆహారంగా తీసుకోవచ్చు. నెయ్యి, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి మఖాన చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉండడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక చలికాలంలో మనం స్మూతీలను కూడా తయారు చేసి తీసుకోవచ్చు.
అరటిపండు, స్ట్రాబెరీ, చియా గింజలు,పెరుగు, పాలకూర వంటి వాటితో స్మూతీలను చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది. అలాగే ఖాండ్విని చేసి కూడా మనం చిరుతిండిగా తీసుకోవచ్చు. శనగపిండి, పెరుగు, నీళ్లతో చేసే ఈ వంటకం రుచిగా ఉండడంతో పాటు కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల చలికాలంలో రుచికరమైన ఆహారాన్ని తీసుకోవాలనే మన కోరిక తీరడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.