Heart Care : శీతాకాలంలో ఎక్కువగా గుండె జబ్బులు రావడానికి గల కారణం ఏమిటో తెలుసా?

Heart Care : సాధారణంగా కాలానికి అనుగుణంగా వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే శీతాకాలంలో  ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడం చేత ఎంతో చల్లగా ఉంటుంది. దీంతో మన శరీర ఉష్ణోగ్రతలు కూడా  పడిపోతాయి. ఇలా మన శరీరం ఎక్కువ చల్లగా ఉండటం వల్ల అధికంగా గుండె జబ్బులకు కారణమవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Heart Care why heart attacks and problems happen most in winter season

శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ క్రమంలోనే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు రావడంతో ఊపిరి తీసుకోవడానికి ఎంతో ఇబ్బందిగా మారుతుంది. చలి తీవ్రతను తట్టుకోలేక రక్తపోటు విషయంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇలా జరగడం వల్ల గుండె సంబంధ సమస్యలకు కారణం అవుతుంది. అందుకోసమే శీతాకాలంలో గుండె సమస్యలతో బాధ పడకుండా ఉండాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.

శీతాకాలంలో పూర్తిగా మన శరీరాన్ని వెచ్చగా ఉంచటం కోసం ప్రయత్నించాలి. ఈ కాలానికి అనుగుణంగా ఉండే దుస్తులను ధరించాలి.

మన శరీరంలో వేడిని పెంచే ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలి. అదేవిధంగా మనం ఆహారపదార్థాలను తినేటప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకుని వేడిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తినడం వల్ల మన శరీరం వేడిగా ఉండటంతోపాటు రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. దీంతో గుండె పని తీరు సక్రమంగా ఉంటుంది. ఇలా గుండె పనితీరు మెరుగ్గా ఉండటం వల్ల ఏ విధమైనటువంటి గుండె సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కనుక శీతాకాలంలో శరీరాన్ని వేడిగా ఉంచుకునే ప్రయత్నం చేస్తే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

Share
Sailaja N

Recent Posts