ఆహారాలను అతిగా తింటున్నారా ? ఈ సమస్య నుంచి సులభంగా ఇలా బయట పడండి..!

ఏ ఆహార పదార్థాన్నయినా సరే పరిమిత మోతాదులోనే తినాలి. అతిగా తినడం వల్ల అనర్థాలు సంభవిస్తాయి. తక్కువ మోతాదులో తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే ఆహారాలు.. ఎక్కువ మోతాదులో తింటే నష్టాలను కలగజేస్తాయి. అయితే కొందరికి అతిగా తినడం అనే సమస్య ఉంటుంది. దీని నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

here it is how to over come over eating problem

నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారాన్ని తక్కువగా తింటారు. అందువల్ల ఇకపై మీరు భోజనం చేస్తే నేలపై కూర్చుని తినండి. దీంతో ఆహారాన్ని తక్కువగా తింటుంటారు. ఫలితంగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.

భోజనం చేసేటప్పుడు చాలా మంది టీవీలు చూస్తుంటారు. కొందరు పుస్తకాలు చదువుతారు. కొందరు ఫోన్లు చూస్తారు. ఇలా చేయడం వల్ల నిజంగానే ఎక్కువగా తింటారు. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం.. అనే దానిపై నియంత్రణ ఉండదు. కనుక తినేటప్పుడు వాటిని చూడరాదు. దీంతో ఆహారం తక్కువగా తినేందుకు అవకాశం ఉంటుంది.

చాలా మంది భోజనాన్ని వేగంగా చేస్తుంటారు. ఇలా చేస్తే ఎక్కువగా తినేందుకు అవకాశం ఉంటుంది. కనుక కొద్దిగా ఆహార పదార్థాలను పెట్టుకుని నెమ్మదిగా తినాలి. దీంతో ఎక్కువ తింటున్నామన్న భావన కలుగుతుంది. ఫలితంగా ఆహారాలను తక్కువగా తినమని మెదడు సూచన చేస్తుంది. దీంతో ఆహారం తినడం ముగించేస్తాం. ఇలా అతిగా తినడం అనే సమస్యను తగ్గించుకోవచ్చు.

ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే వాటిని కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. కనుక ఆహారాన్ని తక్కువగా తింటారు. అతిగా తినకుండా జాగ్రత్త పడవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నట్స్, చిరుధాన్యాలు, తృణ ధాన్యాల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. వీటిని రోజూ తింటుంటే అతిగా తినడం అనే సమస్య నుంచి బయట పడవచ్చు.

ఆహారాన్ని కనీసం 25 నుంచి 30 సార్లు బాగా నమిలి తినాలి. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తింటాము. ఫలితంగా అతిగా తినడం అనే సమస్య తగ్గుతుంది.

Admin

Recent Posts